రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైద‌రాబాద్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. పురపాలక శాఖ అధికారులతోనూ కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారని చెప్పారు.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల(Heavy Rains)ను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి కేటీఆర్(Minister KTR) తెలిపారు. హైద‌రాబాద్‌(Hyderabad)లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. పురపాలక శాఖ అధికారులతోనూ కూడా ముఖ్యమంత్రి(Chief Minister) ప్రత్యేకంగా మాట్లాడారని చెప్పారు. హైదరాబాద్ నగరంలోనూ జీహెచ్ఎంసీ కమిషనర్(GHMC Commisioner), ఇతర ఉన్నతాధికారులు.. క్షేత్రస్థాయిలో ఉన్న కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ పనిచేస్తున్నారని తెలిపారు. పురపాలక ఉద్యోగుల అన్ని సెలవులను రద్దు చేయడం జరిగింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫోన్ల(Mobiles) ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా సమీక్షిస్తున్నామ‌ని వివ‌రించారు.

కుంభవృష్టిగా వర్షం పడడం.. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం వలన ప్రజలకు కొంత ఇబ్బంది ఎదురవుతున్నది. కానీ ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణా నష్టం జరగకుండా సాధ్యమైనని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మా ప్రధాన లక్ష్యం ప్రాణ నష్టం జరగకుండా చూడడమేన‌ని తెలిపింది.

హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్(Red Alert) ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందన్నారు. హైదరాబాద్ నగరంలో డిసిల్టింగ్ కార్యక్రమాన్ని ఎప్పుడో పూర్తి చేస్తాము. దీంతోపాటు చెరువుల బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా చేపట్టాము. 135 చెరువులకు గేట్లు బిగించాం. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు అధికారులు సిబ్బంది కూడా విస్తృతంగా పనిచేస్తున్నారని వివ‌రించారు. గతంలో ఇలాంటి భారీ వర్షాలు పడితే అనేక ప్రాంతాలు జలమయం అయ్యేవి. అయితే ఈసారి నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన కార్యక్రమాల వలన వరద ప్రభావం కొంత తగ్గింద‌ని పేర్కొన్నారు.

గత సంవత్సరంతో పోల్చుకుంటే ఆయా ప్రాంతాల్లో వరద సమస్య బాగా తగ్గిందని తెలిపారు. ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం పూర్తి సిబ్బంది 24 గంటలు ఈ భారీ వర్షాలను ఎదుర్కొనేందుకు పనిచేస్తుందని తెలియ‌జేశారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మాని.. భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు. భారీ వర్షాల్లో నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీసే విధంగా చిల్లర విమర్శలు చేయవద్దని ఫైర్ అయ్యారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు వర్షాన్ని ఎదుర్కొనేందుకు పనిచేస్తున్నాయి. వారి మనో ధైర్యం దెబ్బతినకుండా నాయకులు మాట్లాడితే బాగుంటుందని సూచించారు.

వరద పెరిగే ప్రాంతాల్లో ఉన్న పౌరులను అలర్ట్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్(Control Rooms) లను ఏర్పాటు చేస్తూ తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నాం. చెరువులకు గండి పడే ప్రమాదం ఉంటే వాటిని కూడా సమీక్షిస్తున్నాం. మూసి వరదను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. వర్షాలు తగ్గుముఖం పట్టగానే వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటాం. వరంగల్ నగరానికి వెళ్లాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించాము. అవసరమైతే రేపు నేను కూడా స్వయంగా వెళ్తానని కేటీఆర్ తెలిపారు.

Updated On 27 July 2023 4:40 AM GMT
Yagnik

Yagnik

Next Story