అమెరికా(America) పర్యటనలో ఉన్న పీసీసీ(PCC) అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎన్ఆర్ఐలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లపై రాజ‌కీయ దుమారం రేగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తుంది? ప్ర‌స్తుత బీఆర్ఎస్(BRS) స‌ర్కార్ అమ‌లుచేస్తున్న నిరంతరాయ కరెంట్ ను కొనసాగిస్తారా? అని స‌మావేశంలో ప్ర‌తినిధులు అడగగా రేవంత్ బ‌దులిస్తూ..

అమెరికా(America) పర్యటనలో ఉన్న పీసీసీ(PCC) అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎన్ఆర్ఐలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లపై రాజ‌కీయ దుమారం రేగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తుంది? ప్ర‌స్తుత బీఆర్ఎస్(BRS) స‌ర్కార్ అమ‌లుచేస్తున్న నిరంతరాయ కరెంట్ ను కొనసాగిస్తారా? అని స‌మావేశంలో ప్ర‌తినిధులు అడగగా రేవంత్ బ‌దులిస్తూ.. తెలంగాణలో 95 శాతం మంది 3 ఎకరాలలోపు ఉన్న చిన్న‌, స‌న్న కారు రైతులు మాత్రమే ఉన్నారని.. వారికి 3 గంటల కరెంట్(Current) ఉంటే సరిపోతుందన్నారు. టోట‌ల్‌గా రైతుల‌కు 8 గంటల విద్యుత్ ఇస్తే సరిపోతుంది అన్నారు. ఉచిత‌ విద్యుత్ పథకంతో కేసీఆర్ రైతుల‌ను మభ్యపెడుతున్నారని వ్యాఖ్యానించారు. విద్యుత్ సంస్థల దగ్గర కమీషన్ల కోసమే ఉచిత కరెంట్ పథకాన్ని వాడుకుంటున్నారని రేవంత్ అన్నారు. ఉచితాన్ని అనుచితంగా వాడుకోవ‌ద్ద‌ని వ్యాఖ్యానించారు.

అయితే.. రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్(KTR) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ దిష్టి బొమ్మలు దహనం చేయాలని సూచించింది. ఉచిత విద్యుత్‌ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్‌ పార్టీదని కేటీఆర్‌ అన్నారు. విద్యుత్‌ ఇవ్వకుండా గతంలో రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది అని గుర్తు చేశారు కేటీఆర్. ఇప్పుడు మరోసారి తన రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్‌ పార్టీ బయటపెట్టుకుందని అన్నారు. కాంగ్రెస్‌ నిర్ణయాన్ని తెలంగాణ రైతాంగం, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు.

Updated On 11 July 2023 5:04 AM GMT
Ehatv

Ehatv

Next Story