బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(KTR) ఆస్తులు, అప్పుల(Debts) వివరాలను ప్రకటించారు. అయితే కేటీఆర్ కంటే ఆయన సమతీమణి శైలిమ(shailima) ఎక్కువ ధనవంతురాలు కావడం విశేషం. ఎన్నికల సంఘానికి(Election Commission) సమర్పించిన నామినేషన్(Nomination) పత్రంలో తనతోపాటు తన సతీమణి శైలిమ పేరు మీద ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు.

బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(KTR) ఆస్తులు, అప్పుల(Debts) వివరాలను ప్రకటించారు. అయితే కేటీఆర్ కంటే ఆయన సమతీమణి శైలిమ(shailima) ఎక్కువ ధనవంతురాలు కావడం విశేషం. ఎన్నికల సంఘానికి(Election Commission) సమర్పించిన నామినేషన్(Nomination) పత్రంలో తనతోపాటు తన సతీమణి శైలిమ పేరు మీద ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. సిరిసిల్ల(sircilla) నియోజవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి కేటీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సిరిసిల్ల మున్సిపల్ ఛైర్మన్ పావని, మరికొందరు పార్టీ నేతల సమక్షంలో రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావును కలిసి, తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, మూడుసార్లు మంత్రిగా పని చేడయంతో కేటీఆర్ ఆస్తులు, అప్పుల వివరాలపై అందరిలో ఆసక్తి కనిపించింది. మొత్తానికి 30 పేజీల తన అఫిడవిట్‌(affidavit) ప్రకారం.. 2018 ఎన్నికల నాటికి ఆయన పేరు మీద 3.63 కోట్ల రూపాయల చరాస్తులు ఉన్నాయి. ప్రస్తుతం అవి 6.92 కోట్ల రూపాయలకు పెరిగాయి. ఇక మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ పేరు మీద ప్రస్తుతం 26.49 కోట్ల రూపాయల విలువైన చరాస్తులున్నాయి. అలాగే మంత్రి కేటీఆర్‌ పేరు మీద 10.41 కోట్ల రూపాయలు, తన సతీమణి శైలిమ పేరు మీద 7.42 కోట్ల రూపాయలు, కుమార్తె అలేఖ్య(Alekhya) పేరు మీద 46.71 లక్షల రూపాయల విలువైన స్థిరాస్తులున్నాయి. ఇక కుటుంబం మొత్తం ఉమ్మడి ఆస్తులు 14.93 లక్షల రూపాయలు ఉన్నాయి. ఇక మంత్రి కేటీఆర్ చేతిలో నగదు రూ.1.42 లక్షలు ఉండగా.. తనకు 33.28 లక్షల మేర అప్పు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు.

ఇక బంగారం విషయానికొస్తే.. మంత్రి కేటీఆర్‌ దగ్గర 2.50 లక్షల రూపాయల విలువైన 100 గ్రాములు, తన సతీమణి శైలిమ దగ్గర 1.89 కోట్ల రూపాయల విలువైన 4.7 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అలాగే మంత్రి కేటీఆర్‌కు ఒక ఇన్నోవా కారు కూడా ఉంది.

Updated On 10 Nov 2023 4:48 AM GMT
Ehatv

Ehatv

Next Story