దేవాదాయశాఖ మంత్రి మరో వివాదంలో చిక్కుకున్నారు. వేములవాడ రాజన్న కోడెల విక్రయంలో మంత్రి ప్రమేయం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దేవాదాయశాఖ మంత్రి మరో వివాదంలో చిక్కుకున్నారు. వేములవాడ రాజన్న కోడెల విక్రయంలో మంత్రి ప్రమేయం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోడెల పంపిణీలో ఆలయ ఈవో వినోద్‌రెడ్డి (EO Vinod Reddy)ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడని, కోడెలు పక్కదారి పడుతున్నాయని వీహెచ్‌పీ(VHP), భజరంగ్‌దళ్ (BajrangDal)నాయకులు ఫిర్యాదులు చేస్తున్నారు. మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) రికమండేషన్‌తో ఆగస్టు 12న 49 కోడెలను రాంబాబు(Rambabu) అనే వ్యక్తికి ఆలయ అధికారులు అప్పగించారని ఆరోపణలు వచ్చాయి. మంత్రి మెప్పుకోసం నిబంధనలకు విరుద్ధంగా ఒక్కరికే పెద్ద ఎత్తున కోడెలను అప్పగించారన్న ప్రచారం జరుగుతోంది. రైతులకు కేవలం రెండు, మూడు కోడెలు అప్పగిస్తారు.. కానీ మంత్రి సిఫారసుతో రాంబాబు అనే వ్యక్తికి ఏకంగా 49 కోడెలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే తాను టెండర్‌ ద్వారానే కోడెలను తీసుకున్నానని రాంబాబు పోలీసులకు తెలిపాడు. రాంబాబు కోడెలకు అనుచరుడిగా ఉన్నాడు. ఇప్పటికే రాంబాబుపై గీసుకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. రాంబాబు పశువుల వ్యాపారం కూడా చేస్తాడు. మంత్రి అనుచరుడిగా ఉన్న రాంబాబుకు 49 కోడెల అప్పగించడం వెనుక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై విచారణ జరపాలని విశ్వహిందూపరిషత్, భజరంగ్‌దళ్‌ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

ehatv

ehatv

Next Story