ఒక్కొక్కరు పది ఓట్లు వేసైనా సరే... మన అభ్యర్థిని గెలిపించాలి.. ఈ మాట ఏ కార్యకర్తో, ఏ ద్వితీయశ్రేణి నేతనో అంటే సరిపెట్టుకోవచ్చు. కానీ ఓ మంత్రి ఈ మాట అంటేనే సమస్య వస్తుంది. మంత్రి కొండా సురేఖ(Konda Surekha) పార్టీ క్యాడర్, బీసీ వర్గాలతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చిత్రమేమిటంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సమక్షంలోనే ఆమె ఈ మాటన్నారు. ఇదిలా ఉంటే మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్(BRS) సీరియస్ అయ్యింది.
ఒక్కొక్కరు పది ఓట్లు వేసైనా సరే... మన అభ్యర్థిని గెలిపించాలి.. ఈ మాట ఏ కార్యకర్తో, ఏ ద్వితీయశ్రేణి నేతనో అంటే సరిపెట్టుకోవచ్చు. కానీ ఓ మంత్రి ఈ మాట అంటేనే సమస్య వస్తుంది. మంత్రి కొండా సురేఖ(Konda Surekha) పార్టీ క్యాడర్, బీసీ వర్గాలతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చిత్రమేమిటంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సమక్షంలోనే ఆమె ఈ మాటన్నారు. ఇదిలా ఉంటే మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్(BRS) సీరియస్ అయ్యింది. ఆమె కులాన్ని ప్రస్తావిస్తూ ఓట్లు అడిగారని, ఎన్నికల నిబంధలనకు(Election Code) విరుద్ధంగా ఆమె చేసిన వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి కంప్లయింట్ చేసింది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ చేసిన ప్రసంగాలపై బీఆర్‌ఎస్ రెండు సార్లు ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘం ఆమెను తీవ్ర స్థాయిలో హెచ్చరించింది కూడా. అయినా ఆమె తన ప్రసంగాలను ఆదే విధంగా కొనసాగిస్తున్నారు. బీఆర్‌ఎస్, కేసీఆర్‌లపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, కులం, మతం ప్రాతిపదికన ఓట్లు అడుగుతున్నారు.