తిరుమల దేవస్థానం విధానాలు తెలంగాణ వారికి కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి అంటూ కామెంట్ చేసిన కొండ సురేఖ.
శ్రీశైలం దేవస్థానానికి వచ్చిన సందర్భంగా మంత్రి కొండ సురేఖ మీడియాతో మాట్లాడారు. విభజనలో భాగంగా శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ కి చెందిన దేవస్థనంగా మారినప్పటికీ మా భక్తి అలాగే ఉంది అంటూ వ్యాఖ్యలు చేసింది. కానీ తిరుమలలో మాత్రం కొంత ఇబ్బందిగా మారింది అని చెప్పారు.
గత ప్రభుత్వం హయాంలో తెలంగాణ నుండి తిరుమలకు వెళ్ళే భక్తులు కొంత నిర్లక్ష్యానికి గురికాబడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం అలా జరగకుండా చర్యలు తీసుకునే విధంగా తెలంగాణ సి.ఎమ్., ఏ.పి. సి.ఎమ్. తో సంప్రదింపులు జరుపుతున్నారు అని చెప్పారు. దీని మీద ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసారు అని చెప్పారు.
తెలంగాణ నుండి భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు దర్శనానికి వెళతారు. తెలంగాణ నుండి TTD కి ఆదాయం వస్తుంది. గతంలో TTD నుండి తెలంగాణలో కళ్యాణ మండపాలు ఏర్పాటు చేసేవారు, పలు దేవాలయాల్లో కార్యక్రమాలు నిర్వహించేవారు అని.. ఇప్పుడు మళ్లీ ఆ విదానాన్ని తీసుకురావాలి అని మంత్రి సురేఖ వ్యాఖ్యానించారు.