మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ కలెక్టరేట్ తిప్పర్తి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Minister Komatireddy Venkatreddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ కలెక్టరేట్ తిప్పర్తి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల(Loksabha Elections) తర్వాత 30 మంది బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు కాంగ్రెస్(Congress)లో చేరబోతున్నారంటూ సంచలనానికి తెరలేపారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌లో 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరని జోస్యం చెప్పారు. తమ ప్రభుత్వం త్వరలోనే పడిపోనుందంటూ బీఆర్ఎస్ నేతలు అంటున్నారనీ.. కానీ పూర్తి కాలం తాము అధికారంలో కొనసాగుతామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోపు అమలు చేసి తీరుతామని మరోమారు స్పష్టం చేశారు.
తెలంగాణ(Telangana) కోసం మంత్రి పదవిని సైతం వదులుకున్న తన గురించి మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి(Jagadeesh Reddy) మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. యాదాద్రి(Yadadri), భద్రాద్రి(Badradri) థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అక్రమాలతోపాటు చత్తీస్‌గఢ్(Chhattisgarh)లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న అక్కసుతోనే ఆయన తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కేంద్రాల్లో అవకతవకలపై విజిలెన్స్, సిట్టింగ్ జడ్జి విచారణ తర్వాత కేసీఆర్ కుటుంబం తర్వాత జైలుకు వెళ్లేది జగదీశ్‌రెడ్డేనని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందన్నారు. కరెంటు బిల్లు(Current Bills)లు కట్టడం మానుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టడం మానుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.