వచ్చే నెల ఫిబ్రవరి నుంచి ఉచిత కరెంట్ ను(Free Current) అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి(Komatireddy) ప్రకటించారు. 200 యూనిట్ల వరకు ప్రజలందరికీ ఫ్రీ కరెంట్ ఇస్తామని తెలిపారు. దాంతోపాటు రూ.500లకే గ్యాస్(LPG) సిలిండర్లను కూడా ఇవ్వనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
వచ్చే నెల ఫిబ్రవరి నుంచి ఉచిత కరెంట్ ను(Free Current) అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి(Komatireddy) ప్రకటించారు. 200 యూనిట్ల వరకు ప్రజలందరికీ ఫ్రీ కరెంట్ ఇస్తామని తెలిపారు. దాంతోపాటు రూ.500లకే గ్యాస్(LPG) సిలిండర్లను కూడా ఇవ్వనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మంగళవారం గాంధీభవన్(Gandhi bhavan) లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ(Congress Manifesto committie) సమావేశమైంది. కోమటిరెడ్డితోపాటు మంత్రి శ్రీధర్ బాబు(Sridhar babu), రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ(Dipadas Munshi), ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కమిటీ చర్చించింది. ఈ సమావేశం అనంతరం మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని కేసీఆర్(KCR) సర్వనాశనం చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం.. విద్యుత్ శాఖకు డబ్బులు చెల్లించకపోవ డంతో డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయా యని విమర్శించారు. ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో కాదు.. వారం రోజుల్లోనే అమలు చేసేవాళ్లమని.. కేసీఆర్, రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం వల్ల కొంత సమయం తీసుకున్నా మని తెలిపారు. అయితే..ఏది ఏమైనా ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.