Minister Komati Reddy : కొత్త అసెంబ్లీ నిర్మించే ఉద్దేశం లేదు
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే రోడ్లు, భవనాల శాఖను నాకు అప్పగించినందుకు అధిష్టానానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(Revanth Reddy) మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Minister Komati Reddy Venkat Reddy) ధన్యవాదాలు తెలియజేశారు. ఆదివారం ఆయన మంత్రిగా(Minister) బాధ్యతల స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ.. 9 ఫైళ్లపై సంతకాలు చేశానని తెలిపారు. ఐదు ఫైళ్లతో రేపు నితిన్ గడ్కరీని కలుస్తానని వెల్లడించారు.

కౌన్సిల్‌ను(Council) షిఫ్ట్ చేయాలని అధికారులను కోరామని తెలిపారు. పాత భవనంలో కౌన్సిల్ నిర్వహిస్తామని వెల్లడించారు. హైదరాబాద్-విజయవాడ హైవేను(Hyderabad-vijayawada Highway) 6 లైన్‌గా మారుస్తామని తెలిపారు. శాసనసభ వ్యవహారాల కార్యాలయం కూల్చి.. కొత్త భవనం నిర్మిస్తామని వెల్లడించారు. కొత్త అసెంబ్లీ(Assembly) నిర్మించే ఉద్దేశం లేదన్నారు. ప్రస్తుత అసెంబ్లీ భవనానికే మరమ్మతులు చేస్తామన్నారు. రేపు ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.