హీరో నాగార్జునకు(Nagarjuna) సంబంధించిన ఎన్ కన్వెన్షన్(N convention) సెంటర్‌ను హైడ్రా శనివారం ఉదయం కూల్చి వేసింది
హీరో నాగార్జునకు(Nagarjuna) సంబంధించిన ఎన్ కన్వెన్షన్(N convention) సెంటర్‌ను హైడ్రా శనివారం ఉదయం కూల్చి వేసింది. మాదాపూర్‌లోని తుమ్మిడి చెరువులో మూడున్నర ఎకరాలు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపైనా కొత్తగా ఏర్పాటు అయిన హైడ్రాకు(Hydra) ఫిర్యాదులు వచ్చాయి. దీనిపైన హైడ్రా సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాత ఎఫ్‌టీఎల్ పరిధిలో కన్వెన్షన్ నిర్మించారని నిర్ధారించుకుంది. ఈ మేరకు ఉదయమే హైడ్రా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను ప్రారంభించింది.
అయితే.. నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy venkat reddy) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 21 తేదీన 'ఎన్' కన్వెన్షన్ పై మంత్రి కోమటిరెడ్డి సీఎంకు లెటర్ వ్రాశారు. తుమ్మిడి చెరువులో ఎఫ్‌టీఎల్ ప్రాంతంలో 'ఎన్' కన్వెన్షన్ నిర్మించినట్లు మంత్రి లేఖలో తెలిపారు. మంత్రి సాటిలైట్ ఫోటోలతో సహా ఆధారాలను హైడ్రాకు చేరవేశారు. మంత్రి లేఖపైన స్పందించిన హైడ్రా కమిషనర్.. త్వరతగతిన విచారణ జరిపి రంగంలోకి దిగింది. మంత్రి లేఖతోనే ఎన్ కన్వెన్షన్ నేలమట్టం అయ్యిందని.. ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంత పెద్ద వారైనా ప్రభుత్వం ఉపేక్షించబోదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.