మెదక్(Medak) ఎంపీ, బీఆర్ఎస్(BRS) దుబ్బాక అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డిని(Kotha Prabhakar Reddy) మంత్రి హరీశ్ రావు(Harish Rao) మరోసారి పరామర్శించారు. కత్తిపోటుతో గాయపడి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో(Yashoda Hospital) చికిత్స పొందుతున్న ఆయనను గురువారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.

BRS Harish Rao
మెదక్(Medak) ఎంపీ, బీఆర్ఎస్(BRS) దుబ్బాక అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డిని(Kotha Prabhakar Reddy) మంత్రి హరీశ్ రావు(Harish Rao) మరోసారి పరామర్శించారు. కత్తిపోటుతో గాయపడి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో(Yashoda Hospital) చికిత్స పొందుతున్న ఆయనను గురువారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్ధితిని వైద్యలు హరీశ్ రావుకు వివరించారు. మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని వైద్యులు మంత్రి హరీష్ రావుకు తెలిపారు. మంత్రి హరీష్ రావు వెంట ఆసుపత్రికి వెళ్లిన వారిలో మంత్రి మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యులు పార్ధసారధి రెడ్డి, సురేష్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజ్ తదితరులు ఉన్నారు.
