కేంద్రమంత్రి నిర్మల సీతారామన్(Nirmala Sitharaman)‎కు విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్‎రావు(Minister Harish Rao). రైతుల మోటార్లకు మీటర్లు మీటర్లు పెట్టనందుకే కేంద్రం తెలంగాణ(Telangana)కు ఇచ్చే నిధులు ఇవ్వలేదని అన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రిగా చెప్పడం ద్వారా.. నిర్మల సీతారామన్ బీజేపీ(BJP) బండారాన్ని బయటపెట్టారని అన్నారాయన.

కేంద్రమంత్రి నిర్మల సీతారామన్(Nirmala Sitharaman)‎కు విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్‎రావు(Minister Harish Rao). రైతుల మోటార్లకు మీటర్లు మీటర్లు పెట్టనందుకే కేంద్రం తెలంగాణ(Telangana)కు ఇచ్చే నిధులు ఇవ్వలేదని అన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రిగా చెప్పడం ద్వారా.. నిర్మల సీతారామన్ బీజేపీ(BJP) బండారాన్ని బయటపెట్టారని అన్నారాయన. బుధవారం ఉదయం సిద్ధిపేటలో మంత్రి హరీష్‎రావు మీడియాతో మాట్లాడారు.

మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం తెలంగాణ సర్కార్‌ను ఒత్తిడి చేసిందని అన్నారు. అందుకు తాము అంగీకరించకపోవడం వల్లే 25 వేల కోట్ల నిధులు ఆపేశారని ఆరోపించారు. కేంద్రం నిధులు రాకపోయినా..69 లక్షల రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ప్రభుత్వం భావించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో రైతు పక్షపాతి సీఎం కేసీఆర్‌ ఒక్కరేనన్న ఆయన.. కేంద్ర నిధులు రూ.25 వేల కోట్లు వస్తే తెలంగాణలో మరింత అభివృద్ది జరిగేదని అన్నారు. ఢిల్లీలో తమని శభాష్ అన్న వ్యక్తులే.. రాష్ట్రానికి వచ్చి విమర్శలు చేస్తున్నారని పరోక్షంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను ఎద్దేవా చేశారు మంత్రి హరీష్‎రావు.

ఈ ఎన్నికలు తెలంగాణకు ఎంతో కీలకమైనవని అన్నారు మంత్రి హరీష్‎రావు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ రైతులకు ఎంతో అన్యాయం చేశాయని అన్నారు. అలాంటి పార్టీలకు ఓట్లేస్తే మోటార్లకు మీటర్లు ఖాయమని రైతులను ఉద్దేశించి హెచ్చరించారు మంత్రి హరీష్‎రావు. ఈ రెండు పార్టీలు పాలిస్తున్న ఆయా రాష్ట్రాల్లో మోటార్లకు మీటర్లు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే మోటార్లకు మీటర్లు పెట్టబోమని ఆ రెండు పార్టీలు బహిరంగంగా ప్రకటనలు చేస్తాయా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతులు సురక్షితంగా ఉన్నారన్న ఆయన..ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్‎గా నిలిచిందన్నారు.

దేశ జీడీపీలో కేంద్రం అప్పులు 57 శాతం ఉండగా.. తెలంగాణ అప్పులు కేవలం 28 శాతమేననన్నారు మంత్రి హరీష్‎రావు. మోదీ హయాంలో కేంద్రం రూ. 100 లక్షల కోట్ల అప్పు చేస్తే.. దేశంలోని 22 రాష్ట్రాల కంటే తక్కువ అప్పు తీసుకుంది తెలంగాణ మాత్రమేనన్నారు. దేశంలోని కార్పొరేటర్లకు రుణ మాఫీ చేసిన మోదీ సర్కార్‌..పేదలను పట్టించుకోలేదని విమర్శించారు హరీష్‎రావు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరగడానికి బీజేపీనే కారణమన్న ఆయన.. బీడీ కట్టలపై పుర్రె గుర్తు ముద్రించి కార్మికులను ఆగం చేసిందన్నారు. చేనేతలు.. పాలప్యాకెట్లపై జీఎస్టీ వేసిన ఘనత బీజేపీ దక్కుతుందని విమర్శించారు మంత్రి హరీష్‌రావు.

Updated On 22 Nov 2023 4:31 AM GMT
Ehatv

Ehatv

Next Story