తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. 21 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో ఉత్సవాలు జరపాలని నిర్షయించినట్లు తెలిపారు. ఒక్కో రోజు ఒక్కో రంగంపై ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.
తెలంగాణ(Telangana) దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్(Cabinet) నిర్ణయం తీసుకుందని మంత్రి హరీష్ రావు(Minister Harish Rao) తెలిపారు. సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. 21 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో ఉత్సవాలు జరపాలని నిర్షయించినట్లు తెలిపారు. ఒక్కో రోజు ఒక్కో రంగంపై ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. కులవృత్తులకు ఆర్థిక సాయం చేయడానికి కేబినెట్ సబ్ కమిటీ(Cabinet Sub Committee) వేసిందని.. ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని వివరించారు. ఈ క్రమంలోనే కేబినెట్ బీసీ బంధు(BC Bandhu) ప్రకటించింది. 111జీవో ను పూర్తిగా ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నకిలీ విత్తనాల మీద ఉక్కుపాదం మోపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే పీడీ యాక్ట్(PD ACT) పెట్టాలని కేబినెట్ ఆదేశించిందని వివరించారు. మక్కలు, జొన్నలు కొనేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఫేజ్ 1, 2 లపై కూడా కేబినెట్ లో చర్చించినట్లు వెల్లడించారు. వీఆర్ఏ లను రెగ్యులరైజ్ చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుదని తెలిపారు. రొండో విడత గొర్రెల పంపిణీకి కేబినెట్ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. వనపర్తి లో జర్నలిస్ట్ భవనానికి(Journalist Building), ఖమ్మం(Khammam)లో 23 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. మైనార్టీ కమిషన్ లో జైన్ కమ్యూనిటీని చేర్చాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. టీఎస్‌పీఎస్సీ(TSPSC) లో 10 పోస్టులను కొత్తగా భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు వెల్లడించారు.