తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) సంతకం ఫోర్జరీ(forgery) అయ్యింది. సంతకం ఫోర్జరీ చేసిన నిందితులు.. డబుల్ బెడ్రూం ఇళ్లు(Double bedroom) కేటాయించాలంటూ సంగారెడ్డి కలెక్టర్‌కు(Sangareddy Collector Office) మంత్రి లెటర్‌హెడ్‌తో లేఖ ఇచ్చారు.

sign forgery
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) సంతకం ఫోర్జరీ(forgery) అయ్యింది. సంతకం ఫోర్జరీ చేసిన నిందితులు.. డబుల్ బెడ్రూం ఇళ్లు(Double bedroom) కేటాయించాలంటూ సంగారెడ్డి కలెక్టర్‌కు(Sangareddy Collector Office) మంత్రి లెటర్‌హెడ్‌తో లేఖ ఇచ్చారు. మంత్రి ఓఎస్డీ డాక్టర్ ఎస్.ఎం.రాజేశ్వర్‌రావు ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసులు(Banjara Hills Police) కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితులను సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్(Ameenpur) మండలం నర్రెగూడం గ్రామానికి చెందిన ఎం.డి.గౌస్‌పాషా, గుంటి శేఖర్ గా గుర్తించారు. గౌస్ పాషా మొబైల్స్ బిజినెస్ చేస్తుండగా. గుంటి శేఖర్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఇరువురు కలిసి డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇతర సోషల్ వెల్ఫేర్ స్కీమ్‌ల ద్వారా లబ్ధి పొందాలనుకున్నారు. ప్లాన్ ప్రకారం.. మంత్రి పేరుతో లెటర్‌హెడ్ తయారు చేశారు. ఆ తర్వాత మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రభుత్వ స్కీమ్‌ల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. అయితే.. కొన్ని రోజుల కిందట డబుల్ బెడ్రూంలకు సంబంధించి విచారణ చేస్తున్న రెవెన్యూ సిబ్బందికి మంత్రి పేరుతో వచ్చిన సిఫారసు లెటర్‌పై అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని మంత్రి ఓఎస్‌డీ దృష్టికి తీసుకువెళ్లారు. వాటిని పరిశీలించి ఫోర్జరీ సంతకాలుగా గుర్తించిన ఓఎస్‌డీ ఎస్‌ఎం రాజేశ్వరరావు.. వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులపై ఐపీసీ 419, 420, 464, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరాలీలో ఇరువురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
