టీడీపీ(TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడుపై(Chandra Babu Naidu) మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధిపై చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ఒకసారి విజయనగరం వచ్చి అభివృద్ధి అంటే ఏమిటో చూడాలని సూచించారు. కుప్పం కంటే మా జిల్లా ఎంతో బాగుంటుందన్నారు.
టీడీపీ(TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడుపై(Chandra Babu Naidu) మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధిపై చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ఒకసారి విజయనగరం వచ్చి అభివృద్ధి అంటే ఏమిటో చూడాలని సూచించారు. కుప్పం కంటే మా జిల్లా ఎంతో బాగుంటుందన్నారు. వర్షాల నేపథ్యంలో ముంపుపై విపక్షాలు విమర్శించడంపై బొత్స స్పందిస్తూ.. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తర భారత దేశంతో పాటు దేశ రాజధాని ఢిల్లీ నగరమే నీట మునిగిపోయింది. హైదరాబాద్ నగరమే మునిగిపోయింది.. చంద్రబాబు కట్టించిన హైటెక్ సిటీనే మునిపోయిందని.. ప్రత్యేక సందర్భాలలో వచ్చే వర్షాలకు ముంపు సహజమన్నారు.
విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ(Education Principal Secretary), కార్యదర్శికి అమ్మఒడి సభకు విద్యార్థులను తీసుకువెళ్లడంపై హైకోర్టు నోటీసులు ఇచ్చింది. మంత్రి బొత్స ఈ విషయమై స్పందిస్తూ.. అమ్మఒడి వంటి కార్యక్రమానికి తల్లిదండ్రులు, విద్యార్థులు రావడంలో తప్పులేదన్నారు. వారు కాకుండా ఇలాంటి కార్యక్రమాలకు సినిమా యాక్టర్లు వస్తారా? అని ప్రశ్నించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల రాకపై హైకోర్టు సూచనలు ఇస్తే పాటిస్తామన్నారు. ప్రజలకు సీఎం జగన్ మంచి చేస్తుంటే టీడీపీ ఓర్చుకోలేకపోతుందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మరోసారి జగన్ ముఖ్యమంత్రిగా వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని జోష్యం చెప్పారు.