హబూబాబాద్(Mahabubabad) జిల్లాలోని ఓ క్రషర్‌లో బాంబ్ బ్లాస్టింగ్(Bomb Blasting) జరిగింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు గ్రామ సమీపంలో ఉన్న రేణుక స్టోన్ క్రషర్ ఉంది. గత కొంత కాలంగా ఇక్కడ క్రషింగ్ జరుగుతోంది.
మహబూబాబాద్(Mahabubabad) జిల్లాలోని ఓ క్రషర్‌లో బాంబ్ బ్లాస్టింగ్(Bomb Blasting) జరిగింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు గ్రామ సమీపంలో ఉన్న రేణుక స్టోన్ క్రషర్ ఉంది. గత కొంత కాలంగా ఇక్కడ క్రషింగ్ జరుగుతోంది. దుమ్ము, ధూళి, బండరాళ్ల ఎగిసిపడడంతో తమకు నష్టం జరుగుతోందని గ్రామస్తులు ఎన్నోసార్లు ఆందోళనలు చేపట్టినా ఇది ఆగలేదు.
ఈ క్రమంలో బుధవారం రాత్రి క్రషర్‌లో బాంబ్ బ్లాస్టింగ్ జరిపారు. దీంతో పక్కనే ఉన్న గాజులగట్టు గ్రామంలోని 25 ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. బాంబ్ బ్లాస్టింగ్ వల్ల భారీ శబ్ధాలు రావడంతో భయంతో గ్రామస్తులు రోడ్లపైకి పరుగులు తీశారు. అంతేకాకుండా ఆ క్రషర్ వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. బ్లాస్టింగ్ దెబ్బకు రోడ్లపై కూడా గుంతలు పడ్డాయి. బండరాళ్లు ఎగిరి వచ్చి పంటల పొలాలపై పడ్డాయి. మిర్చి, పత్తి, మొక్క జొన్న పంటలకు నష్టం వాటిల్లింది. ఈ క్రషర్‌కు వ్యతిరేకంగా గాజులగట్టు గ్రామస్తులు ఎప్పటినుంచో పోరాడుతున్నారు. అయినా రేణుక క్రషర్ యాజమాన్యం తన పని తాను చేస్తోంది. నిబంధనల ప్రకారమే తమ క్రషర్ నడుస్తోందని యాజమాన్యం చెప్తోంది. అయితే ఈ క్రషర్ ద్వారా తమ పంటలు, ఇళ్లకు నష్టం జరుగుతోందని.. దుమ్ము, ధూళితో తమ ఆరోగ్యం దెబ్బతింటోందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా ఈ క్రషర్ అనుమతులను రద్దు చేసి తమ బతుకులను కాపాడాలని వారుకోరుతున్నారు.