తెలంగాణలో రోజుల‌పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం నుంచి గురువారం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని పేర్కొంది. నైరుతి ఆవర్తనం, దాని పరిసరాల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కొనసాగుతున్నదని వివరించింది.

తెలంగాణ(Telangana)లో రోజుల‌పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు(Heavy Rain) కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ(Department of Meteorology) తెలిపింది. మంగళవారం నుంచి గురువారం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని పేర్కొంది. నైరుతి ఆవర్తనం, దాని పరిసరాల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కొనసాగుతున్నదని వివరించింది. ఈ కారణంగా వర్షాలు ఉండవచ్చని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అప్ర‌మ‌త్తం చేసింది. గడిచిన 24 గంటల్లో వికారాబాద్‌(Vikarabad) జిల్లాలో అత్యధికంగా 163.3 మి.మీ వర్షపాతం నమోదైంది.

బుధవారం ఆదిలాబాద్‌(Adilabad), కుమ్రం భీం ఆసిఫాబాద్‌(Asifabad), రాజన్న సిరిసిల్ల(Rajanna Siricilla), సిద్దిపేట(Siddipeta), రంగారెడ్డి(Rangareddy), వికారాబాద్‌, సంగారెడ్డి(Sangareddy), మెదక్‌(Medak), కామారెడ్డి(Kamareddy), హైదరాబాద్‌(Hyderabad), మేడ్చల్‌ మల్కాజిగిరి(Medchal Malkajgiri), మహబూబ్‌నగర్‌(Mahboob Nagar) జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.

గురువారం జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నదని వివరించింది.

తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ(Telangana State Development Planning Society) సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌(Jubili Hills)లో అత్యధికంగా 28.5 మి.మీ వర్షపాతం నమోదైంది.

Updated On 4 July 2023 8:31 PM GMT
Yagnik

Yagnik

Next Story