హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లోని కామినేని చౌరస్తా ఫ్లైఓవర్

హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లోని కామినేని చౌరస్తా ఫ్లైఓవర్ కింద పలువురు అంబులెన్స్ డ్రైవర్లపై స్థానిక వ్యాపారులు కర్రలతో దాడికి పాల్పడ్డారు అంబులెన్స్ డ్రైవర్లు తమ వ్యాపారానికి ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ ఈ దాడిని తెగబడ్డారు. అంబులెన్స్‌లను అక్కడ పార్క్ చేయవద్దని కోరడంతో గొడవ మొదలైంది.. ఆ తర్వాత వ్యాపారి డ్రైవర్లపై దాడికి తెగబడ్డాడు. క్షణాల్లో ఆ ప్రాంతం యుద్ధ వాతావరణంలా తయారైంది. పెద్ద ఎత్తున వ్యాపారులు.. వారి కుటుంబాలు అంబులెన్స్ డ్రైవర్లపై దాడులకు తెగబడ్డాయి.

గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులు స్థానిక వ్యాపారి, అతని సహచరులపై LB నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోంది.

Updated On 24 May 2024 12:22 AM GMT
Yagnik

Yagnik

Next Story