రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళి సైతో కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రభుత్వ ఏర్పాటుకు తమను అహ్వానించాల్సిందిగా గవర్నర్ ను కోరారు.

Meeting of Congress leaders with Governor
రాజ్ భవన్(Raj Bhavan)లో గవర్నర్ తమిళి సై(Governor Tamilisai)తో కాంగ్రెస్ ముఖ్య నేతలు(Congress Leaders) భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రభుత్వ ఏర్పాటుకు తమను అహ్వానించాల్సిందిగా గవర్నర్ ను కోరారు. గవర్నర్ ను కలిసిన వారిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే(Manikrao Thackrey), కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shiva Kumar), ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttamkumar Rddy), ఇతర ముఖ్య నేతలు ఉన్నారు.
ఇదిలావుంటే.. సోమవారం ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ సమావేశం(CLP Meeting) ఉంటుంది. ఈ భేటీలో సీఎల్పీ నాయకుడిని ఎన్నుకోనున్నారు. ఈ రోజు ప్రమాణ స్వీకారం ఉంటుంది. పలువురు మంత్రులుగా ప్రమాణం చేస్తారని ఓ లేఖ వైరల్(Fake Letter) అవుతుంది. అది అబద్దపు ప్రచారమని పీసీసీ ఖండించింది. నేడు సీఎల్పీ సమావేశం మాత్రమే ఉందని.. ప్రమాణ స్వీకారోత్సవం లేదని వివరణ ఇచ్చింది.
