ఎర్రచందనం(Red Sandal) పేరు వినగానే పుష్ప సినిమా గుర్తుకు వస్తుంది. సినిమాలో మాదిరిగానే ఓ ముగ్గురు వ్య‌క్తులు ఎర్రచందనం దుంగలు స్మగ్లింగ్(Sumggling) చేయాలని ప్రయత్నించారు. కానీ చివరకు పోలీసుల చేతికి చిక్కి జైలు పాల‌య్యారు. మేడ్చల్ పోలీస్(Medchal) స్టేషన్ పరిధిలో ఎస్ఓటి బృందానికి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా సమాచారం అందింది. దీంతో పోలీసులు వాహనాల తనిఖీలు చేప‌ట్టారు.

ఎర్రచందనం(Red Sandal) పేరు వినగానే పుష్ప సినిమా గుర్తుకు వస్తుంది. సినిమాలో మాదిరిగానే ఓ ముగ్గురు వ్య‌క్తులు ఎర్రచందనం దుంగలు స్మగ్లింగ్(Sumggling) చేయాలని ప్రయత్నించారు. కానీ చివరకు పోలీసుల చేతికి చిక్కి జైలు పాల‌య్యారు. మేడ్చల్ పోలీస్(Medchal) స్టేషన్ పరిధిలో ఎస్ఓటి బృందానికి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా సమాచారం అందింది. దీంతో పోలీసులు వాహనాల తనిఖీలు చేప‌ట్టారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన డీసీఎంపై(DCM) అనుమానం కలగడంతో వెంటనే వాహ‌నాన్ని ఆపి తనిఖీ చేయడం మొదలుపెట్టారు. డీసీఎం నిండా కొబ్బరి బోండాలు ఉన్నాయి. పోలీసులకు అనుమానం వచ్చి కొబ్బరి బోండాలు తొలగించి చూడగా ఎర్రచందనం దుంగలు కనిపించాయి.

డీసీఎం లో కొబ్బరి బొండాల(Coconut) మాటున ఉన్న 101 ఎర్రచందనం దుంగలను బయటకు తీసి అక్రమంగా ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న ముగ్గురిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి డీసీఎం.. ఒక కోటి 50 లక్షలు విలువ చేసే మూడు వేల కేజీల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు నిందితులు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు నుండి ఎర్రచందనం దుంగలు తీసుకొని హైదరాబాద్ మీదుగా కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది.

Updated On 30 Dec 2023 1:30 AM GMT
Ehatv

Ehatv

Next Story