సీఎం రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) త్వరలోనే కలుస్తానన్నారు మాజీ మంత్రి చేమకూర మల్లారెడ్డి(Malla Reddy). నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేముందని వ్యాఖ్యానించారు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS) సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే..పార్టీ మారుతున్నారని ప్రచారం చేశారని అన్నారు. అలాంటి చర్చకు తావులేకుండా కలిసే ముందు మీడియాకు సమాచారం ఇస్తానని చెప్పారు.

MLA Malla Reddy
సీఎం రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) త్వరలోనే కలుస్తానన్నారు మాజీ మంత్రి చేమకూర మల్లారెడ్డి(Malla Reddy). నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేముందని వ్యాఖ్యానించారు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS) సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే..పార్టీ మారుతున్నారని ప్రచారం చేశారని అన్నారు. అలాంటి చర్చకు తావులేకుండా కలిసే ముందు మీడియాకు సమాచారం ఇస్తానని చెప్పారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. అటు పార్టీ ఓటమిపై మల్లారెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాము ఓడిపోతామని.. కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా ఊహించలేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలో తాము ఇంకా షాక్‌లోనే ఉన్నామని అన్నారు. ఆ షాక్ నుంచి ఒక్కొక్కరం మెల్లగా తేరుకుంటున్నామని చెబుతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటుమన్నారు మల్లారెడ్డి. ‘మల్కాజిగిరి ఎంపీగా నన్నే పోటీ చేయమన్నారు.. కానీ, నేను టికెట్‌ను నా కుమారుడు భద్రారెడ్డికి అడుగుతున్నాను’ అని చెప్పారు. ఇద్దరిలో ఎవరికిచ్చినా బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రచారం చేస్తామన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి.
