రాకాసి గాలి దుమారం ఓ చిన్నారిని బలితీసుకుంది. కవలపిల్లలైన అక్కాచెల్లెళ్లు సంగీత, సీత అమ్మానాన్నలు పొలానికి వెళ్లారు. ఇద్దరు చిన్నారులు రేకుల షెడ్డకు ఉయ్యాల కట్టుకుని ఆడుకుంటున్నారు. వారి ఆనందాన్ని గాలి దుమారం చిదిమివేసింది.
రాకాసి గాలి దుమారం ఓ చిన్నారిని బలితీసుకుంది. కవలపిల్లలైన అక్కాచెల్లెళ్లు సంగీత, సీత అమ్మానాన్నలు పొలానికి వెళ్లారు. ఇద్దరు చిన్నారులు రేకుల షెడ్డకు ఉయ్యాల కట్టుకుని ఆడుకుంటున్నారు. వారి ఆనందాన్ని గాలి దుమారం చిదిమివేసింది. సుడిగాలిగా(Tornado) విరుచుకుపడి ఉయ్యాలలో ఉన్న సంగీతను రేకుల షెడ్డుతో పాటుగా విసిరికొట్టింది. ఆ వేగానికి రెండేళ్ల అవతల ఓ స్లాబ్‌పై పడింది ఆ చిన్నారి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. మెదక్(Medak) జిల్లా కౌడిపల్లి మండలం రాజిపేటలో ఈ విషాదం చోటు చేసుకుంది. జాజితండాకు చెందిన మంజుల(Manjula), మాన్‌సింగ్(Mansingh) దంపతులకు సంగీత, సీత అనే కవలలు(Twins) ఉన్నారు. తండాలోనే ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సంగీత ఒకటో తరగతి చదువుతోంది. సోమవారం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో నానమ్మతో ఉన్న సంగీత, సీత రేకుల షెడ్డుకు ఉయ్యాల కట్టుకుని ఆడుకున్నారు. కాసేపటికి నానమ్మ, సీత ఇద్దరూ పక్కింటికి వెళ్లారు. అప్పుడే పెద్ద సుడిగాలి తరుముకొచ్చింది. రేకులతో పాటు చిన్నారి సంగీతను ఎగరేసుకుపోయింది. రెండిళ్ల అవతల ఉన్న ఇంటిపైన చిన్నారిన పడేసింది. తీవ్ర గాయాలైన సంగీతను వెంటనే 108 వాహనంలో నర్సాపూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మంగళవారం సంగీత చనిపోయింది.