హైదరాబాద్‌లోని(Hyderabad) నేరెడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్(Neredmet Police Station) పరిధిలో ఓ వివాహిత(Married woman) అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. తలకు తీవ్ర గాయమై రక్తపు మడుగులో మెడకు చున్నీ బిగించిన స్థితిలో ఇంట్లో ఆమె చనిపోయి కనిపించింది. జహర్‌నగర్‌ పోలీసుస్టేషన్ పరిధి కౌకూర్‌ మల్లారెడ్డి కాలనీలో ఉంటున్న కృష్ణ, సుశీల దంపతుల కూతురు మాధవి (34) పెళ్లి 2007లో బేగంపేట ప్రకాశ్‌నగర్‌కు(Prakash Nagar) చెందన రాజుతో జరిగింది.

హైదరాబాద్‌లోని(Hyderabad) నేరెడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్(Neredmet Police Station) పరిధిలో ఓ వివాహిత(Married woman) అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. తలకు తీవ్ర గాయమై రక్తపు మడుగులో మెడకు చున్నీ బిగించిన స్థితిలో ఇంట్లో ఆమె చనిపోయి కనిపించింది. జహర్‌నగర్‌ పోలీసుస్టేషన్ పరిధి కౌకూర్‌ మల్లారెడ్డి కాలనీలో ఉంటున్న కృష్ణ, సుశీల దంపతుల కూతురు మాధవి (34) పెళ్లి 2007లో బేగంపేట ప్రకాశ్‌నగర్‌కు(Prakash Nagar) చెందన రాజుతో జరిగింది. ఈ దంపతులకు కుమారులు పవన్‌ (15), మున్నా (11), కూతురు శ్రీజ (13)లు ఉన్నారు. 2021లో అనారోగ్యం కారణంగా రాజు చనిపోయాడు. తర్వాత మాధవి తన ముగ్గరు సంతానాన్ని తల్లి ఇంట్లో ఉంచి చదివిస్తోంది. ఎఎస్‌రావు నగర్‌లోని ఓ డెంటల్‌ క్లినిక్‌లో అసిస్టెంట్‌గా పని చేస్తోంది. మాధవికి సికింద్రాబాద్‌(Secunderabad) అడ్డగుట్టకు చెందిన సాయితో పరిచయం ఏర్పడింది. సాయికి అప్పటికే పెళ్లయ్యింది. అయినా ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. ఎనిమిది నెలల కిందట సఫిల్‌గూడ బలరాంనగర్‌లోని ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. సోమవారం ఉదయం 6.40 గంటలకు మాధవి పెద్ద కొడుకు పవన్‌కు సాయి ఫోన్‌ చేశాడు. మీ అమ్మ ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. మాధవి తల్లిదండ్రులు, పిల్లలు, బంధువులు వెళ్లి చూడగా గదిలో తలకు గాయమై రక్తపు మడుగులో మాధవి మృతి చెంది ఉంది. సీఐ సందీప్‌కుమార్, ఎస్సై రమేష్‌లు ఘటన స్థలికి చేరుకుని ఆధారాల్ని సేకరించారు. మృతురాలి దగ్గర రెండు సెల్‌ఫోన్‌లు, టూ వీలర్‌ వెహికిల్‌, 20 వేల రూపాయల నగదు ఉంది. అవేవీ కనిపించలేదు. సాయి వాటిని తీసుకొని పరారయ్యాడని పోలీసులు భావిస్తున్నారు. సాయి నడిపే ఆటో మాధవే కొన్నదని బంధువులు తెలిపారు. అతడు చిక్కితే అన్ని విషయాలు బయటకొస్తాయని పోలీసులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి తల్లి తనకు ఫోన్‌ చేసిందని పవన్‌ పోలీసులకు చెప్పాడు. తన దగ్గర 20 వేల రూపాయలు ఉన్నాయని, వాటితో పాటు తన ఫోన్‌ నుంచి ఎనిమిది వేలు బదిలీ చేసుకోవాలని చెప్పిందని పోలీసులకు వివరించాడు పవన్‌. తనకు ప్రాణభయం ఉందని మాధవికి ముందుగానే తెలుసా? లేక ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో కొడుక్కి డబ్బులు అందజేయాలని అనుకొని ఫోన్‌ చేసిందా? ఆత్మహత్య అయితే మెడకు చున్నీతో ఉరి వేసుకొని ఉండాలి. అలా కాకుండా రక్తపు మడుగులో కింద పడి ఉండడాన్ని చూస్తే ఇది ఆత్మహత్య కాదు, హత్యేనని అనుమానం కలుగుతోంది. మరోవైపు పవన్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చి సాయి ఎందుకు పారిపోయాడనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 4 Jun 2024 1:08 AM GMT
Ehatv

Ehatv

Next Story