తెలంగాణలో కాంగ్రెస్(Telangana congress) ప్రభుత్వ పాలన తీరు పట్ల మావోయిస్టులు లేఖ(Maoist letter) విడుదల చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్(Telangana congress) ప్రభుత్వ పాలన తీరు పట్ల మావోయిస్టులు లేఖ(Maoist letter) విడుదల చేశారు. తెలంగాణలో బుల్డోజర్ పాలన కొనసాగిస్తున్నారని మావోలు మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తోందని, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం మాత్రం దూకుడుగా పనిచేస్తోందని మావోయిస్టు పార్టీ విమర్శించింది. మావోయిస్టు పార్టీ తన లేఖలో హైడ్రా(Hyrda), మూసీ సుందరీకరణ(Mus bueatification) అంశాలను, ఇటీవల కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో జరిగిన కూడా ప్రస్తావించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్(YS JAgan) పేరిట లేఖ విడుదలైంది. లగచర్లలో ఫార్మాసిటీని(Pharma) నిర్మించి, ప్రకృతి వనరులతో పాటు రైతుల పంట భూములను కొల్లగొట్టడానికి పథకం పన్నారని ఆరోపించారు. భూములు కోల్పోతున్న రైతులు జీవన్మరణ పోరాటంలో భాగంగా మిలిటెంట్ ఉద్యమం చేపట్టారని వెల్లడించారు.

ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న విధ్వంసం, అప్రజాస్వామిక పాలన కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల, బాధ్యతారాహిత్య వల్లనో జరుగుతున్నది కాదని... ఉద్దేశపూర్వకంగా, కార్పొరేట్ల లాభాల కోసం జరుగుతున్న ప్రయత్నమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్పొరేట్ల నమ్మినబంటునని నిరూపించుకోవడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడని విమర్శించారు. కార్పొరేట్ల పెట్టుబడులలో వాటా, భారీ మొత్తంలో కమీషన్లు పొందుతున్నాడని ఆరోపించారు. ప్రజలు అనాగరిక బుల్డోజర్ దాడులను వ్యతిరేకించాలని, దామగుండంలో రాడార్ స్టేషన్ ను, లగచర్లలో ఫార్మాసిటీని వ్యతిరేకించాలని... ఈ క్రమంలో వీరోచిత మిలిటెంట్ ఉద్యమాలు చేపట్టాలని తమ లేఖలో పిలుపునిచ్చారు.

Eha Tv

Eha Tv

Next Story