మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి(Maoist Raji Reddy) (70) అలియాస్ సాయన్న కన్నుమూసినట్లు వార్తలు వస్తున్నాయి. అనారోగ్య కారణాలతో మల్లా రాజిరెడ్డి మరణించారనేది వార్తల సారాంశం. అయితే రాజారెడ్డి మృతిపై ఇప్పటివరకు మావోయిస్టు పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు. మల్లా రాజిరెడ్డి స్వస్థలం పెద్దపెల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్‌పూర్ పరిధిలోని శాస్త్రులపల్లి.

మల్లారెడ్డి దండకారణ్యంలో కీలకంగా వ్యవహరించారు. ఆయనను సంగ్రామ్, సాయన్న, మీసాల సాయన్న, అలోక్, దేశ్‌పాండే, సత్తెన్న వంటి పేర్లతో పిలిచేవారు. తొలితరం మావోయిస్టు నేతల్లో ఒకరైన రాజిరెడ్డిపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది.