తుంగతుర్తికి ఏమున్నదని వస్తున్నావని మాజీ సీఎం కేసీఆర్‌ను ప్ర‌శ్నించారు తుంగ‌తుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్. నీ బిడ్డ తీహార్ జైల్లో ఉంది..

తుంగతుర్తి(Thungathurthy)కి ఏమున్నదని వస్తున్నావని మాజీ సీఎం కేసీఆర్‌(CM KCR)ను ప్ర‌శ్నించారు తుంగ‌తుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్. నీ బిడ్డ తీహార్(Tihar) జైల్లో ఉంది.. నీ కొడుకు కేసుల పాలయ్యిండు.. నీ అల్లుడు నీ ఇల్లు ఎప్పుడు కూలిపోతుందని ఎదురు చూస్తూ ఉండు.. నీ కుటుంబం మొత్తం ఆగమైపోతుంది.. అధికారంలో ఉన్నప్పుడు నీవు చేసిన పాపాలే నిన్ను.. నీ పార్టీని బొంద పెట్టాయ‌ని అన్నారు.

మీరు చేసిన పాపాల‌తో నీ కుటుంబం ఈడీ చేతుల్లోకి వెళ్లింద‌న్నారు. నయిం దగ్గర ఉన్న డబ్బును లెక్కించడానికి రెండు రోజులు పట్టింది.. ఆ డబ్బు అంతా ఎక్కడికి పోయింద‌ని ప్ర‌శ్నించారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే అప్పటి ఆస్తులు ఎంత ఇప్పుడున్న ఆస్తులు ఎంత అని ప్ర‌శ్నించారు. జగదీశ్వరి నగరం మండలంలో నీవు చేసిన బు కబ్జాలన్నీ బయటికి తీస్తామ‌న్నారు.

ఈ నాలుగు నెలల్లో తిరుమలగిరి ఇంటర్ కాలేజ్, తుంగతుర్తిలో 100 పడకల హాస్పిటల్ కు, రూ.150 కోట్లతో రోడ్ల నిర్మాణం చేశాన‌ని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతామ‌న్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న‌ప్పుడు హరీష్ రావు, కేసీఆర్‌ మీ ఆస్తి ఎంత అని ప్ర‌శ్నించారు. తెలంగాణ ఉద్యమంతో కేసిఆర్ నీ కొడుకుకు ఏం సంబంధం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మీకు ప్ర‌జ‌లు ఎలా బుద్ధి చెప్పారో.. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓటు ద్వారా అదే బుద్ధి చెబుతార‌ని అన్నారు.

Updated On 30 March 2024 9:54 PM GMT
Yagnik

Yagnik

Next Story