ఉమ్మడి నిజామాబాద్‌(Nizamabad) జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు(Mandava Venkateswar Rao) బీఆర్‌ఎస్‌కు(BRS) గుడ్‌పై చెప్పి కాంగ్రెస్‌లో(Congress) చేరుతున్నారు. ఇవాళ బోధన్‌లో(Bodhan) రాహుల్‌గాంధీ(RAhul hgandhi) సమక్షంలో కాంగ్రెస్‌పార్టీలో చేరబోతున్నారు. ఆయన చేరికతో కాంగ్రెస్‌కు కొత్త ఉత్సాహం రానుంది. చాలా నియోజకవర్గాలలో మండవ ప్రభావం చూపే అవకాశం ఉంది. గత పార్లమెంట్‌ ఎన్నికల(Parliament Elections) సమయంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన మండవ వెంకటేశ్వరరావు అప్పట్నుంచి గులాబీదళంలోనే ఉన్నారు.

ఉమ్మడి నిజామాబాద్‌(Nizamabad) జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు(Mandava Venkateswar Rao) బీఆర్‌ఎస్‌కు(BRS) గుడ్‌పై చెప్పి కాంగ్రెస్‌లో(Congress) చేరుతున్నారు. ఇవాళ బోధన్‌లో(Bodhan) రాహుల్‌గాంధీ(RAhul hgandhi) సమక్షంలో కాంగ్రెస్‌పార్టీలో చేరబోతున్నారు. ఆయన చేరికతో కాంగ్రెస్‌కు కొత్త ఉత్సాహం రానుంది. చాలా నియోజకవర్గాలలో మండవ ప్రభావం చూపే అవకాశం ఉంది. గత పార్లమెంట్‌ ఎన్నికల(Parliament Elections) సమయంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన మండవ వెంకటేశ్వరరావు అప్పట్నుంచి గులాబీదళంలోనే ఉన్నారు. కేసీఆర్‌(KCR) ఆయనకు ఎలాంటి హామీలు ఇచ్చారో తెలియదు కానీ చాన్నాళ్లుగా ఆయన బీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీలో తనకు తగిన గుర్తుంపు లేదన్న అసంతృప్తి ఆయనలో గూడుకట్టుకుని ఉంది. మండవ చేరిక ఓ రకంగా కాంగ్రెస్‌కు టానిక్‌ లాంటిదే. నిజామాబాద్‌ రూరల్‌, ఆర్మూర్‌, బోధన్‌, బాన్సువాడా నియోజకవర్ఆలలో సెటిలర్లు ఎక్కువగా ఉన్నారు. మరీ ముఖ్యంగా కమ్మ సామాజికవర్గం వారు ఎక్కువగా. వీరందరికీ మండవ పెద్దదిక్కుగా ఉంటారు. మండవ మాటకు గౌరవమిస్తారు. మండవ వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరుతున్నారు కాబట్టి.. ఆయన సామాజికవర్గానికి చెందిన ఓట్లన్నీ(Votes) హస్తం గుర్తుకు పడే అవకాశం ఉంది.
ఎన్టీఆర్‌(NTR) స్థాపించిన తెలుగుదేశం పార్టీతోనే(TDP) మండవ వెంకటేశ్వరరావు రాజకీయ జీవితం మొదలయ్యింది. 1985లో మొదటిసారి డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. 1995లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. 1997లో చంద్రబాబు మంత్రివర్గంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా పని చేశార. 1999 తర్వాత భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా మూడేళ్లు బాధ్యతలు నిర్వర్తించారు. 2002లో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు.

Updated On 25 Nov 2023 1:16 AM GMT
Ehatv

Ehatv

Next Story