న్యూ ఇయర్‌ వేడుకల(New Year Celebrations) సందర్భంగా మానకొండూరు(Manakondur) నియోజకవర్గం ఎమ్మెల్యే తన కళాపోసన చాటుకున్నారు. ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు కొట్టగానే కేక్‌ కట్‌ చేసి, బాణాసంచా కాల్చి కొత్త ఏడాదికి స్వాగతం పలికారు.

న్యూ ఇయర్‌ వేడుకల(New Year Celebrations) సందర్భంగా మానకొండూరు(Manakondur) నియోజకవర్గం ఎమ్మెల్యే తన కళాపోసన చాటుకున్నారు. ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు కొట్టగానే కేక్‌ కట్‌ చేసి, బాణాసంచా కాల్చి కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. కాకపోతే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ(Kavvampally Satyanarayana) ఇంకొంచెం అత్యుత్సాహం కనబర్చారు. కేక్‌ కటింగ్‌ అప్పుడు అక్కడున్న మహిళా కార్యకర్తలతో ఎమ్మెల్యే అసభ్యంగా ప్రవర్తించారు. ఓ మహిళా కార్యకర్త ముఖానికి ఆయన కేక్‌ పూసాడు. ఆమె పక్కకు తప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ వదల్లేదు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar)ను పక్కకు నెట్టి మరి సత్యనారాయణ మరోసారి ఆ మహిళా కార్యకర్త మొహానికి కేక్‌ పూసాడు. ఎమ్మెల్యే ప్రవర్తనతో ఆమె చాలా ఇబ్బందిపడ్డారు. మరో వీడియోలో తాను డ్యాన్సు చేస్తూ... సదరు మహిళను కూడా డ్యాన్స్ చేయాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి ఇబ్బందిపెట్టడం కనిపించింది. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated On 2 Jan 2024 6:56 AM GMT
Ehatv

Ehatv

Next Story