డబ్బు(Money) నీచమైనదని చెబుతుంటారు.
డబ్బు(Money) నీచమైనదని చెబుతుంటారు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే నీచాతినీచమని తెలుస్తున్నది. పాపిష్టి ధనం కోసం దిగజారిపోతున్నాడు నరుడు. రక్తం పంచుకుని పుట్టిన అన్నలను కూడా వదలడం లేదు. కేవలం 20 వేల రూపాయల వడ్డీ డబ్బుల(Interest) కోసం ఓ వ్యక్తి తన సొంత అన్నావదినను చెట్టుకు కట్టేసి దాడి చేశాడు. సిద్దిపేట(Siddipet) పట్టణంలోని నాసర్‌పురాలో(Nasarpura) జరిగిన ఈ ఘటన స్థానికులకు కన్నీరు పెట్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... సిద్దిపేట పట్టణానికి చెందిన దొంతరబోయిన పరశురాములు తన అవసరాల నిమిత్తం సొంత తమ్ముడు కనకయ్య దగ్గర లక్ష రూపాయల అప్పుగా తీసుకున్నాడు. నాలుగు నెలల కిందట ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాడు. మిగిలిన 20 వేల రూపాయల వడ్డీ కోసం తమ్ముడు కనకయ్య అన్న పరశురాములను వేధించాడు. ఈ క్రమంలో కౌన్సిలర్ జంగిటి కనకరాజు దగ్గరకు వీరి పంచాయితీ వెళ్లింది. ఆయన వీరిద్దరిని పిలిచి మాట్లాడుతుండగానే ఇద్దరు గొడవకు దిగారు. వారిని కౌన్సిలర్ అక్కడి నుంచి పంపించేశారు. అన్న పరశురాములు వెళ్లి పోతుంటే తనకు ఇవ్వాల్సి వడ్డీ డబ్బులు ఇవ్వకుండా ఎలా పోతావో? చూస్తానంటూ అన్నను లాక్కొచ్చి హనుమాన్ దేవాలయ ప్రాంగణంలోని చెట్టుకు కట్టేశాడు. అతంటితో ఆగకుండా అడ్డువచ్చిన వదినను సైతం కట్టేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించారు. పరశురాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కనకయ్యపై కేసు నమోదు చేశారు పోలీసులు.