ఆన్‌లైన్ గేమ్‌లు(online Games) ఆడి ఉన్నదంతా ఊడ్చిపెట్టుకున్నాడు. అప్పులు(Debt) చేసి మళ్లీ ఆడాడు.
ఆన్‌లైన్ గేమ్‌లు(online Games) ఆడి ఉన్నదంతా ఊడ్చిపెట్టుకున్నాడు. అప్పులు(Debt) చేసి మళ్లీ ఆడాడు. అక్కడా దెబ్బతిన్నాడు. అప్పులవాళ్ల తాకిడి ఎక్కువయ్యేసరికి వాటిని తీర్చడానికి ఆ మోసగాడు బ్రహ్మండమైన ప్లాన్ వేశాడు. ఆల్‌రెడీ పెళ్లయ్యి విడాకులు తీసుకున్న ఇతగాడు మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. మ్యాట్రిమోనిలో(Matrimony) ఫేక్ ప్రొఫైల్(Fake Profile) సృష్టించి ఓ కుటుంబాన్ని బురిడీ కొట్టించాడు. అన్నట్టు ఈ కుట్రలో అతడి కుటుంబసభ్యులంతా పాల్గొనడం గమనార్హం. వివరాల్లోకి వెళితే ఖమ్మం(Khammam) జిల్లా ఎనుకూరు మండలం, రాజలింగాల గ్రామానికి చెందిన 38 ఏళ్ల నల్లమోతు సందీప్‌కుమార్ రష్యాలో(russia) ఎంబీబీఎస్(MBBS) చదివాడు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ, మల్లంపేటలో ఉంటున్నాడు. ఇంతకు ముందు నీలిమ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. విడాకులు కూడా ఇచ్చాడు. ఇతడికి ఆన్‌లైన్ గేమ్‌లు ఆడే దురలవాటు ఉంది. అందులో భారీగా నష్టపోయాడు. ఇందులోంచి బయటపడటానికి మార్గం వెతుక్కున్నాడు. ఇందుకు అతడి కుటుంబసభ్యులు కూడా హెల్ప్ చేశారు. మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. తాను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి రేడీయాలజిస్టు పూర్తి చేశానట్టు, 2016లో ఐఏఎస్‌గా(IAS) ఎంపికై కర్ణాటకలో పనిచేస్తున్నట్టు నకిలీ పత్రాలు సృష్టిం చి మ్యాట్రిమోనిలో పేరు నమోదు చేసుకున్నాడు. ఇదంతా నిజమని నమ్మేశారు శ్రావణి(sravani) అనే అమ్మాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా, ఆదోని మండలం, కుల్మాన్ పేట గ్రామానికి చెందిన ఈ అమ్మాయి సందీప్‌కుమార్‌ను 2018లో పెళ్లి చేసుకున్నారు. కట్నం కింద ఎనిమిది ఎకరాల భూమిని సందీప్‌కు కట్టబెట్టారు. కొంతకాలం బాగానే ఉన్నాడు. తర్వాత తన బ్యాంక్ లాకర్‌లో 40 కోట్ల రూపాయలు నగదు ఉందని, ఆదాయపు పన్ను చెల్లించకపోవడంతో ఆ మొత్తాన్ని హోల్డ్‌లో పెట్టారని, అవి విడుదల కావడానికి రెండు కోట్ల రూపాయలు కావాలని శ్రావణిని అడిగాడు. ఇది కూడా నిజమేనని నమ్మిన ఆమె తెలిసిన వారి దగ్గర నుంచి అప్పు తీసుకుని కొంత అమౌంట్‌ను భర్త ఖాతాలో వేసింది. మిగతాది సందీప్ సోదరి మోతుకూరి లక్ష్మీ సాహితీ, మామ విజయ్‌కుమార్, అత్త మాలతి అకౌంట్‌లలో బదిలీ చేసింది. పెళ్లి బంగారాన్ని కూడా తాకట్టు పెడుతుండటంతో శ్రావణికి అనుమానం కలిగింది. సందీప్‌ను నిలదీసింది. దాంతో ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పుడు సందీప్ బండారం బట్టబయలు అయ్యింది.
పోలీసులు అమెరికాలో ఉన్న సాహితి తప్ప మిగతా కుటుంబసభ్యులందరినీ అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.