తనకు కట్నం(Dowry) కింద ఇస్తానన్న ఎకరం పొలం(Land) ఇవ్వలేదని పిల్లనిచ్చిన మామనే(Father-in-law) కొట్టి చంపాడు ఓ ప్రబుద్ధుడు. పెళ్లి సమయంలో 13 తులాల బంగారం, 3.5 లక్షల రూపాయలు, ఎకరం పొలం కట్నంగా ఇస్తానని ఒప్పుకున్న మామ, పొలం ఇస్తే అమ్మేస్తాడన్న భయంతో ఇవ్వకపోవడంతో మామతో గొడవ పడి దారుణంగా కొట్టి చంపాడు(Killed) అల్లుడు.
తనకు కట్నం(Dowry) కింద ఇస్తానన్న ఎకరం పొలం(Land) ఇవ్వలేదని పిల్లనిచ్చిన మామనే(Father-in-law) కొట్టి చంపాడు ఓ ప్రబుద్ధుడు. పెళ్లి సమయంలో 13 తులాల బంగారం, 3.5 లక్షల రూపాయలు, ఎకరం పొలం కట్నంగా ఇస్తానని ఒప్పుకున్న మామ, పొలం ఇస్తే అమ్మేస్తాడన్న భయంతో ఇవ్వకపోవడంతో మామతో గొడవ పడి దారుణంగా కొట్టి చంపాడు(Killed) అల్లుడు. ఈ ఘటన నాగర్‌కర్నూల్(Nagarkurnool) జిల్లా ఉప్పునుంతల మండలం మర్రిపల్లిలో(Marripalli) చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఉప్పునుంతల మండలం మర్రిపల్లికి చెందిన సోనమోని అలివేలు, వెంకటయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కొడుకు ఉన్నారు. కూతురు మాధవిని(Madhavi) రెండేళ్ల క్రితం ఉప్పునుంతలకు చెందిన సాయిబాబుకు ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో 13 తులాల బంగారం, రూ.3.5 లక్షల నగదు ఇచ్చారు. పొలం ఇస్తే అమ్ముకుంటాడన్న భయంతో ఇవ్వకుండా వాయిదాలు వేస్తూ వచ్చాడు మామ వెంకటయ్య. పెళ్లయిన 6 నెలల నుంచే తనకు ఇస్తానన్న ఎకరం పొలం ఇవ్వాలని మాధవిని వేధించేవాడు. తరచుగా భార్యపై చేయిచేసుకోవడంతోపాటు(Domestic Violence).. అత్తామామలతో గొడవపడేవాడు. ఈ క్రమంలో నవంబర్ 30న సాయంత్రం మర్రిపల్లికి వెళ్లిన సాయిబాబు అత్త అలివేలుతో తీవ్ర వాగ్వాదం పెట్టుకున్నాడు. చుట్టుపక్కలవారు వచ్చి మందలించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మామను చంపేస్తానంటూ ఊరంతా వెతికాడు. మామ వెంకటయ్య పొలం వద్ద ఉన్నట్లు తెలుసుకున్న సాయిబాబు.. అతని దగ్గరికి వెళ్లి ఘర్షణ పడ్డాడు. వెంకటయ్యతో గొడవపడి అతనిని తీవ్రంగా కొట్టటడంతో బలంగా గాయలై స్పాట్‌లోనే చనిపోయాడు. పక్క పొలంలో ఉన్న మరో రైతు జగదీష్ వెళ్లి చూడగా వెంకటయ్య చనిపోయి ఉండడంతో కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంకటయ్యను తమ అల్లుడు సాయిబాబు కొట్టిచంపాడని అలివేలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.