తెలంగాణ(Telangana) షాద్‌నగర్(Shadnagar)కు చెందిన ఓ యువకుడు ఆస్టేలియా(Australia)లోని సిడ్నీ(Sydney) నగరంలో అనుమానాస్పదరీతిలో చనిపోయాడు. అరటి ఉషారాణి, కృష్ణ దంపతుల కుమారుడు 35 ఏళ్ల అరవింద్ కొలువు కోసం పదేళ్ల కిందట ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడే స్థిరపడ్డాడు.
తెలంగాణ(Telangana) షాద్‌నగర్(Shadnagar)కు చెందిన ఓ యువకుడు ఆస్టేలియా(Australia)లోని సిడ్నీ(Sydney) నగరంలో అనుమానాస్పదరీతిలో చనిపోయాడు. అరటి ఉషారాణి, కృష్ణ దంపతుల కుమారుడు 35 ఏళ్ల అరవింద్ కొలువు కోసం పదేళ్ల కిందట ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడే స్థిరపడ్డాడు. ఏడాదిన్నర కిందట కేశంపేట మండలం చింతకుంటపల్లికి చెందిన సిరివెన్నెలను పెళ్లి చేసుకున్నాడు. భార్యను సిడ్నీకి తీసుకెళ్లాడు. అరవింద్ తల్లి ఉషారాణి మొన్నీమధ్యనే సిడ్నీకి వెళ్లి నాలుగు రోజుల కిందటే షాద్‌నగర్‌కు తిరిగి వచ్చింది. అదే రోజు కారును వాష్ చేయించాలని చెప్పి అరవింద్ ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. మూడు రోజులు గడచినా ఇంటికి రాకపోయేసరికి అరవింద్ భార్య సిరివెన్నెల పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం నాడు సముద్ర తీరంలో ఓ కారును గుర్తించారు. సమీపంలోనే ఓ మృతదేహం ఉండటం గమనించారు. ఆ మృతదేహం అరవింద్‌గా తేలింది. కుటుంబసభ్యులకు పోలీసులు వివరాలు తెలిపారు. అరవింద్ తండ్రి కృష్ణ స్థానిక బీజేపీ నాయకుడు. ఆయన కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందాడు. అరవింద్ మృతిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) విచారం వ్యక్తం చేశారు. మూడు రోజుల్లో మృతదేహాన్ని షాద్‌నగర్‌కు తీసుకురావడానికి ప్రయత్నిస్తామన్నారు.