తెలంగాణ ఆర్టీసీలో(TS RTC) మహిళలకు ఉచిత ప్రయాణవసతి కల్పిండాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో(High court) ప్రజాహిత వ్యాజ్యం(PIL) దాఖలయ్యింది. ఆర్టీసీ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం వివక్ష కిందకే వస్తుందని తన పిల్‌లో పేర్కొన్నాడా వ్యక్తి.
తెలంగాణ ఆర్టీసీలో(TS RTC) మహిళలకు ఉచిత ప్రయాణవసతి కల్పిండాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో(High court) ప్రజాహిత వ్యాజ్యం(PIL) దాఖలయ్యింది. ఆర్టీసీ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం వివక్ష కిందకే వస్తుందని తన పిల్‌లో పేర్కొన్నాడా వ్యక్తి. 1950లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రోడ్డు రవాణా చట్టం ప్రకారం ఆర్టీసీ కార్పొరేషన్(RTC Corporaion) ఏర్పాటైందని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నది ఆయన వాదన. మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం పురుషుల పట్ల వివక్ష చూపడమే అవుతుందని, ఇది రాజ్యాంగంలోని(Constitution) 15వ అధికరణానికి వ్యతిరేకమని అంటున్నాడు. ఉచిత ప్రయాణ వసతి కారణంగా మహిళలు అవసరం లేకపోయినా ప్రయాణిస్తున్నారని, టికెట్లు కొనుగోలు చేసి ప్రయాణించే పురుషులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పాడు. ఉచిత ప్రయాణం వల్ల ఆర్థికంగా ఆర్టీసీపై పడే భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడం అన్యాయమని, పన్నుల రూపంలో ప్రజలు కట్టిన డబ్బును మహిళల ఉచిత ప్రయాణ వసతికి వినియోగించడం తప్పని పిల్‌లో పేర్కొన్నాడు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టుకు విన్నవించుకున్నాడు. తెలంగాణ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శితోపాటు ఆర్టీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖను ఈ పిల్‌లో ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం త్వరలో విచారణ జరపనుంది.