కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు స్వగ్రామానికి ఎళ్లిన వ్యక్తి తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

Man dies in mishap while returning from Praja Palana
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ(Congress Six Guarantees)ల కోసం దరఖాస్తు(Apply) చేసుకునేందుకు స్వగ్రామానికి ఎళ్లిన వ్యక్తి తిరిగి హైదరాబాద్(Hyderabad)కు వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హవేళిఘనపూర్(Haveli Ghanapur)కు చెందిన కమ్మరి రవీందర్ (57) కొన్నేళ్ల క్రితం హైదరాబాద్(Hyderabad)కు వలస వచ్చాడు. బుధవారం తన గ్రామంలో ప్రజాపాలన(Prajapalana) కార్యక్రమం నిర్వహించడంతో హవేళిఘనపూర్‌కు వెళ్లాడు. అక్కడ దరఖాస్తు సమర్పించిన అనంతరం మెదక్(Medak)కు చేరుకుని బస్సులో హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. మెదక్ కోర్టు సమీపంలో విద్యార్థులను దించి వస్తున్న స్కూల్ బస్సు(School Bus) ఆటో(Auto)ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవీందర్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆటో డ్రైవర్‌తోపాటు దంపతులకు గాయాలయ్యాయి.
