గుర్రంపై(Horse) స్వారీ చేయడమంటే మామూలు విషయం కాదు.

గుర్రంపై(Horse) స్వారీ చేయడమంటే మామూలు విషయం కాదు. దానికి బోల్డంత ట్రైనింగ్‌ కావాలి. అవగాహన లేకుండా గుర్రపు స్వారీ చేయకూడదు. చేస్తే ప్రాణాలతో చెలగాటమాడినట్టే! కర్నూలు జిల్లా మద్దికేరకు చెందిన పృథ్వీరాజ్‌రాయుడు (28) అనే యువకుడు ఉత్త పుణ్యానికి గుర్రంపై స్వారీ చేశాడు. ముచ్చపడి కొంత దూరం వెళ్లాడు. గుర్రాన్ని అదిలిస్తూ ముందుకు వెళ్లాడు. గుర్రం వేగంగా పరుగెత్తేసరికి అదుపుతప్పి కింద పడిపోయాడు. దాంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని కర్నూలు(Kurnool) ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ పృథ్విరాజ్‌ కన్నుమూశాడు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Eha Tv

Eha Tv

Next Story