☰
✕
భక్తుల(Devottes) మొక్కులు బహు విచిత్రంగా ఉంటాయి.భక్తుల(Devottes) మొక్కులు బహు విచిత్రంగా ఉంటాయి.
x
భక్తుల(Devottes) మొక్కులు బహు విచిత్రంగా ఉంటాయి. మహబూబాబాద్(Mahabubnagar) జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని లక్ష్మీనగర్ నివాసి వెంకటేశ్వర్లు ముత్యాలమ్మకు చిత్రమైన మొక్కు మొక్కాడు. అక్కడ ముత్యాలమ్మ బోనాల(Bonal ) పండుగ ఘనంగా జరుగుతుంటుంది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు తన మొక్కు చెల్లించుకున్నాడు. కోడిపుంజుకు(cock) చెవి కమ్మలు(Earrings) కుట్టించి అందంగా అలంకరించాడు. తర్వాత కోడి మెడలో మద్యం బాటిల్ వేసి అమ్మవారికి మొక్కు తీర్చుకున్నాడు. డబ్బుచప్పుళ్లతో ఊరేగింపుగా ముత్యాలమ్మ గుడికి వచ్చాడు వెంకటేశ్వర్లు. అతడు మొక్కలు చెల్లిస్తున్న తీరును స్థానికులు ఆశ్చర్యంగా చూశారు. కోడిపుంజుతో వారు కూడా ఫోటోలు దిగారు. అయితే వెంకటేశ్వర్లు ఇలా పుంజుకు కమ్మలు కుట్టించడం ఇదేం మొదటిసారి కాదట! ప్రతీసారి ఇలాగే మొక్కు చెల్లించుకుంటాడట!
Eha Tv
Next Story