నిజామాబాద్(Nizamabad) జిల్లాకు చెందిన కాంత్రి కుమార్‌కు(kranthi kumar) ఇద్దరు కుమార్తెలు.
నిజామాబాద్(Nizamabad) జిల్లాకు చెందిన కాంత్రి కుమార్‌కు(kranthi kumar) ఇద్దరు కుమార్తెలు. కాగా పెద్ద కూతురు నేహశ్రీకి మానసిక ఆరోగ్యం(Mental health) కుదుట పడకపోవడంతో మనస్తాపం చెంది కూతురితో కలిసి చెరువులో(River) దూకి సూసైడ్(suicide) చేసుకున్నాడు. సూసైడ్ నోట్‌లో(Suicide note) తన భార్య, చిన్న కూతురు సంతోషంగా ఉండాలని రాసి చనిపోయాడు. ఒక వైపు 18 నెలల కుమార్తెకు తీవ్ర అనారోగ్య సమస్య.. మరోవైపు ఆర్థిక భారం.. దీంతో మానసికంగా కృంగిపోయాడు ఓ తండ్రి.
మోపాల్ మండలంలోని న్యాల్‌కల్ మాసాని చెరువులో కూతురుతో సహా దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్ కూడా రాశాడు.. అందులో
వెళ్లిపోతున్నా.. క్షమించాలంటూ భార్య మానస, కుటుంబ సభ్యులకు చెప్పాడు. రఘుపతి క్రాంతికుమార్ (35)కు జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మానసతో వివాహం జరిగింది. వీరికి 18 నెలల నేహశ్రీ , 3 నెలల వయస్సుగల మరో పాప ఉంది. నేహ శ్రీపై తండ్రి ఎంతో ప్రేమ పెంచుకున్నాడు. నేహశ్రీకి మానసిక అనారోగ్యం కారణంగా రెండు సార్లు బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది. ఆస్పత్రి ఖర్చులు పెరిగిపోయి అప్పుల కుప్ప ఎక్కువైంది. రెండు ఆపరేషన్లు జరిగినా కూతురు ఆరోగ్యం మెరుగుపడలేదు. మరోవైపు అప్పులు తీర్చే మార్గం లేక క్రాంతికుమార్ క్రాంతికుమార్ మనోవేదన చెందాడు. ఆదివారం పుట్టిన రోజు కూడా ఉండడంతో రాత్రి ఇంట్లో స్నేహితులతో జరుపుకున్నాడు. రోజంతా సంతోషంగా గడిపిన ఆయన పెద్ద కూతురుతో కలిసి నిద్రపోయాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో నేహ శ్రీని తీసుకొని బైక్‌పై మాసాని చెరువు కట్టకు చేరుకుని కూతురితో కలిసి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం భర్త క్రాంతి, పెద్ద కూతురు కనపడకపోవడంతో భార్య మానస కంగారుపడింది. తల్లిదండ్రులు, బంధువులంతా కలిసి క్రాంతికుమార్ కోసం వెతికారు. క్రాంతికుమార్ బైక్‌ను మాసాని చెరువు కట్టపై కన్పించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. గజఈతగాళ్లతో మృతదేహాలను వెలికి తీయించారు. సూసైడ్ నోట్‌లో సారీ అమ్మ, నాన్న, భార్య, చెల్లె, తమ్ముడు.. తాను వెళ్లిపోతున్నానని.. భార్య మానస, చిన్న కూతురు సంతోషంగా ఉండాలని రాశాడు.