స్కూల్‌లోనే దుకాణం పెట్టేశాడు..!

విద్యార్థి(student) తప్పు దోవలో వెళ్తే ఆ విద్యార్థిని మంచి నడవడిలోకి తీసుకొచ్చేది కేవలం ఉపాధ్యాయుడే. ఎంతటి మొద్దబ్బాయి అయినా, మాట వినని విద్యార్థులనైనా మార్చే శక్తి గురువుకు(teacher) మాత్రమే ఉంటుంది. గురువు మాట విని చెడిపోయినవాడు తెలిసి తెలిసి ఎవరూ ఉండరు. పుస్తకల్లోని పాఠాలతో పాటు బతుకు పాఠాలు నేర్పించాల్సిన గురువు ఇతర అలవాట్లకు బానిసగా మారాడు. విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పించి వారిని మంచి నడవడిలోకి తీసుకురావాల్సిన ఓ ఉపాధ్యాయ ప్రబుద్ధుడు మద్యానికి(alcohol) బానిసయ్యాడు. ప్రతిరోజూ మద్యం తాగి స్కూల్‌కు వెళ్తున్నాడు. అంతేకాదు విద్యార్థుల ముందే మందు, పొగ తాగుతున్నాడు. దీంతో సార్‌కు ఎదురుచెప్పలేక విద్యార్థులు మౌనవేదన అనుభవిస్తున్నారు. సూర్యాపేట(suryapet) జిల్లా మోతె మండలం రామాపురం తండాలో ఇది జరిగింది.

ఉపేందర్‌ అనే ఉపాధ్యాయుడు రామాపురం తండాలో ఎస్‌జీటీగా మూడేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. అయితే మనోడికి మద్యం లేనిదే పూట గడవదు. అంత ఉదయాన్నే మనోడికి మందు ఎక్కడ దొరుకుతుందో తెలియదు కానీ స్కూల్‌ వచ్చే సమయంలోనే మద్యం సేవించి వస్తాడు. వస్తూ వస్తూ ఓ నైంటో, క్వార్టరో వెంట తెచ్చుకుంటాడు. పిల్లల ముందే మందు సేవిస్తాడు, పొగ తాగుతాడు. మత్తులో తూగుతూ హాయిగా నిద్ర పోతున్నాడు. తోటి ఉపాధ్యాయులు కూడా చెప్పిచూశారు. గ్రామస్తులు కూడా పలు సార్లు పద్ధతి మార్చుకోవాలని హితవు చెప్పారు. విద్యార్థులకు పుస్తకాల పాఠాలు, బతుకు పాఠాల కంటే కూడా మనోడి బాగోతం పాఠాలే ఎక్కువైపోయాయి. విద్యార్థులు దినదిన గండంగా గడుపుతున్నారు. గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువైందని వాపోతున్నారు. ఉపాధ్యాయుడు ఉపేందర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story