మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌, నాంపల్లి కోర్టులో బాంబు పెట్టినట్లు ఫోన్‌ చేసిన వ్యక్తిని హైద‌రాబాద్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌, నాంపల్లి కోర్టులో బాంబు పెట్టినట్లు ఫోన్‌ చేసిన వ్యక్తిని హైద‌రాబాద్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నగరంలోని చిక్కడపల్లి ప్రాంతానికి చెందిన శివ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు ఆరా తీసి అదుపులోకి తీసుకున్నారు. ప్రజా భవన్‌ను త్వరలో బాంబుల‌తో పేలుస్తానని నిందితుడు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. దీంతో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారిక నివాసం ఉన్న ఆ భవనాన్ని డాగ్ స్క్వాడ్‌లు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లతో సహా పోలీసు బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఏమి దొర‌క‌క‌పోవ‌డంతో అది బూటకపు కాల్ అని తేలింది.

అదే మొబైల్ నంబర్ నుంచి నాంపల్లి కోర్టులో బాంబు పెట్టినట్లు పోలీసు కంట్రోల్ రూంకు మరో కాల్ వచ్చింది. కోర్టు భవనంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రెండు కాల్స్ చేసిన తర్వాత నిందితుడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. పోలీసులు విచారణ చేపట్టి బుధవారం కాల్ చేసిన వ్యక్తిని గుర్తించారు. భార్యతో గొడవపడి మద్యం మత్తులో కాల్‌లు చేశానని నిందితుడు పోలీసులకు తెలిపాడు. ఇతను గతంలో బైక్ చోరీ కేసులో ఇరుక్కున్నాడు. పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు.

Updated On 29 May 2024 9:16 PM GMT
Yagnik

Yagnik

Next Story