రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయని.. దాసోజు శ్రావణ్ కూడా ఈ కోవకు చెందిన వాడేనని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. దాసోజు ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నాడనే భ్రమలో ఉన్నట్లుందని.. ఎఐసీసీకి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు లేఖ రాశారు.
రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయని.. దాసోజు శ్రావణ్(Dasoju Sravan) కూడా ఈ కోవకు చెందిన వాడేనని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి(Mallu Ravi) అన్నారు. గాంధీ భవన్(Gandhi Bhavan)లో ఆయన మాట్లాడుతూ.. దాసోజు ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నాడనే భ్రమలో ఉన్నట్లుందని.. ఎఐసీసీ(AICC)కి రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై ఫిర్యాదు లేఖ రాశారు. రాజకీయాల్లో బూతులు తిట్టే సాంప్రదాయం కేసీఆర్ నుంచే వచ్చిందని అన్నారు. తిట్లు తిట్టడంలో కేసీఆర్ యూనివర్సిటీ పట్టభద్రుడని ఎద్దేవా చేశారు. కేసీఆర్(KCR) కిషన్ రెడ్డి(Kishan Reddy)ని రండ మంత్రి, చేతగాని దద్దమ్మ అనలేదా అని గుర్తుచేశారు.
నాయకులను కుక్కలు, నక్కలు, దద్దమ్మలు, కుక్కమూతి పిండాలు, దరిద్రులు ఇవన్ని కేసీఆర్ తిట్లా దండకాలని అన్నారు. కేసీఆర్ ప్రతిపక్ష నాయకులని తిట్టిన తిట్లకు మేము ఎన్ని లేఖలు రాయాలని ప్రశ్నించారు. విద్యుత్ ఇష్యూలో బీఆర్ఎస్(BRS) గొయ్యిని వారే తొవ్వుకున్నట్లు ఉందని అన్నారు. 24 గంటల విద్యుత్ ఇవ్వలేదని రుజువు అయ్యింది. కేసీఆర్ మాట విని బండి సంజయ్(Bandi Sanjay) ను అధ్యక్ష పదవి నుంచి తప్పించారని అన్నారు. బండి సంజయ్ ను మార్చినట్లు రేవంత్ రెడ్డిని మార్చలేరని అన్నారు. రేవంత్ రెడ్డి దళిత, గిరిజన, మైనార్టీ, బీసీ పక్షపాతి అని అన్నారు. కాంగ్రెస్(Congress) కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అన్నారు.