బీసీ నేత బండి సంజయ్ కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనే పక్కన పెట్టారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి వ్యాఖ్యానించారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ పని అయిపోయింది కాబట్టే అధ్యక్షుడిని మార్చారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనన్నారు

Mallu Ravi Comments On BJP High Command
బీసీ నేత బండి సంజయ్(Bandi Sanjay) కేసీఆర్(KCR) కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనే పక్కన పెట్టారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి(Mallu Ravi) వ్యాఖ్యానించారు. గాంధీ భవన్(Gandhi Bhavan) లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ పని అయిపోయింది కాబట్టే అధ్యక్షుడిని మార్చారని అన్నారు. బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) రెండూ ఒక్కటేనన్నారు. లిక్కర్ స్కాం(Liquore Scam)లో అరెస్ట్ చేయకుండా ఆపింది ఎందుకు.? కవిత(Kavitha) అరెస్ట్ కాకుంటే పార్టీకి ఇబ్బంది అవుద్దని.. బీజేపీ నేతలు అంటున్నా మోదీ(Modi), అమిత్ షా(Amit Shah) పట్టించుకోవడం లేదన్నారు. మోదీ అబద్ధాలు చెప్పడం ఆపేయ్యాలన్నారు. కేసీఆర్ లక్షల కోట్లు తింటున్నారని మోదీ పదేపదే చెపుతున్నారు.. కానీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రధాని వాళ్ళ రాష్ట్రాలకు వెళ్తే స్టాలిన్(Stalin), విజయన్(Vijayan) తమకు కావాల్సినవి అడుగుతున్నారని అన్నారు. మోదీని నిలదీసే అవకాశంను బీఆర్ఎస్ మిస్ చేసిందన్నారు. ప్రజలు బీఆర్ఎస్ ను బహిష్కరిస్తారని వ్యాఖ్యానించారు.
