వెంట్రుక కూడా పీకలేరు అని కేటీఆర్ మాట్లాడడం ఏం భాష.? అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్ర‌శ్నించారు. చదువుకున్న కేటీఆర్ అంత దిగజారి మాట్లాడుతున్నారని.. భాష, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండని సూచించారు

వెంట్రుక కూడా పీకలేరు అని కేటీఆర్ మాట్లాడడం ఏం భాష.? అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్ర‌శ్నించారు. చదువుకున్న కేటీఆర్ అంత దిగజారి మాట్లాడుతున్నారని.. భాష, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండని సూచించారు. ఏప్రిల్ 6న కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఉంటుంద‌న్నారు. మేం చేసిన, చేపట్టనున్న విషయాలను ఏప్రిల్ 6న ప్రజలకు వివరిస్తామ‌న్నారు. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచే వ్యూహంపై చర్చించామ‌ని తెలిపారు.

కాంగ్రెస్ మేనిఫెస్టో ఏప్రిల్ 6న విడుదల చేస్తామ‌ని వెల్ల‌డించారు. వంద రోజుల ప్రభుత్వ పాలనపై చర్చించామ‌ని.. తెలంగాణను ఒక మోడల్ గా తీసుకువెళ్లాలని నిర్ణయించామ‌న్నారు. ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి తుక్కుగూడ సభ నాందిగా భావిస్తున్నామ‌న్నారు. బీఆర్ఎస్ లాగా మేం పాలన గాలికి వదిలేయలేదన్నారు. వ్యవసాయశాఖ మంత్రి 24 గంటలు రైతులతో మాట్లాడుతూ ఉన్నారని.. మీలాగా మేం ఇళ్ల నుండి బయటకి రాకుండా సోషల్ మీడియాకి పరిమితం కావడం లేదని ప్ర‌తిప‌క్షాల‌కు స‌మాధాన‌మిచ్చారు.

Updated On 29 March 2024 9:31 PM GMT
Yagnik

Yagnik

Next Story