మాజీ మంత్రి మల్లారెడ్డి(Mallareddy) మరోసారి సోషల్‌ మీడియాలో వైరలవుతున్నారు.

మాజీ మంత్రి మల్లారెడ్డి(Mallareddy) మరోసారి సోషల్‌ మీడియాలో వైరలవుతున్నారు. 75 ఏళ్ల వయసుల్లో కుర్రోడిలా మారి..డాన్స్‌తో(Dance) అదరగొట్టారు. డీజే టిల్లు సాంగ్‌కు(DJ Tillu song) డ్యాన్స్‌ వేసి అందరినీ ఆకట్టుకున్నారు.. మల్లారెడ్డి మనవరాలు, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి(Raja shekar reddy) కూతురు వివాహం ఈనెల 27న జరగబోతుంది. దీంతో వివాహానికి వివాహానికి ముందు జరిగే పలు కార్యక్రమాలు అవుతున్నాయి. ఆదివారం రాత్రి సంగీత్ నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రి జరిగిన సంగీత్ కార్యక్రమంలో మల్లారెడ్డి తన పర్‌ఫాం ఏంటో చూపించారు. మంచి కాస్ట్యూమ్‌తో, కళ్ల జోడు పెట్టుకొని మనవళ్లు, కొరియోగ్రాఫర్లతో కలిసి స్టెప్పులు వేశారు. ఇందుకోసం మల్లారెడ్డి గత వారం రోజులుగా కొరియోగ్రాఫర్ల దగ్గర శిక్షణ కూడా తీసుకున్నారు. గతంలోనూ మల్లారెడ్డి పలు వేదికలపై డ్యాన్సులు వేశారు. ఇది మాత్రం సినిమా స్టైల్‌లో వెరైటీగా కనిపిస్తుంది. ఇప్పుడు మల్లారెడ్డి డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో మల్లారెడ్డా.. మజాకా.. అని కామెంట్స్ చేస్తున్నారు.

Updated On 21 Oct 2024 6:59 AM GMT
Eha Tv

Eha Tv

Next Story