సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), ఎమ్మెల్యే మల్లారెడ్డి గతంలో టీడీపీలో ఉండేవారు. అయితే టీడీపీలో ఉన్నప్పటి నుంచి వీరిద్దరి మధ్య పొరపొచ్చాలు ఉన్నాయని టాక్. 2014లో మల్కాజ్‌గిరి ఎంపీగా తనను పోటీ చేయాడానికి మల్లారెడ్డి(Malla Reddy) అడ్డుపడ్డారని రేవంత్ భావించేవారట. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత కొద్ది రోజులకే మల్లారెడ్డి బీఆర్‌ఎస్‌లో(BRS) చేరారు. 2018 ఎన్నికలకు కొద్ది నెలల ముందు కాంగ్రెస్‌లో(Congress) రేవంత్‌రెడ్డి చేరిపోయారు. 2018లో మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచి మల్లారెడ్డి మంత్రి పదవి చేపట్టారు. కొడంగల్(Kodangal) నుంచి పోటీ చేసి ఓడిపోయిన రేవంత్ మల్కాజ్‌గిరి(Malkajgiri) ఎంపీగా పోటీ చేసి.. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిపై 11 వేల మెజార్టీతో గెలుపొందారు. దీంతో వీరిద్దరి మధ్య సహజంగానే వైరుధ్యాలు నెలకొన్నాయి.

ఈ క్రమంలో రేవంత్‌కు పీసీసీ(PCC) పదవి రావడంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. అవకాశం చిక్కినప్పుడుల్లా ఒకరినొకరు ఘాటైన వ్యాఖ్యలతో విమర్శించుకుంటూ వచ్చారు. మల్లారెడ్డి పెద్ద భూ కబ్జాదారుడని.. జవహర్‌నగర్‌లోని(Jawahar nagar) భూములు కబ్జాపెట్టాడని.. సూరారం చెరువును కబ్జా చేసి ఆస్పత్రి నిర్మించాడని రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. మేడ్చల్‌లో ఎవరు వెంచర్ వేసినా మల్లారెడ్డికి వాటా రావాల్సిందేనని ఆరోపణలు చేశారు. మూడుచింతలపల్లిలో జరిగిన కాంగ్రెస్ సభలో మంత్రి మల్లారెడ్డి భూములు కబ్జా చేశాడని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పాలు(Milk), పూలు(Flowers) అమ్ముకునే మల్లారెడ్డికి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. మల్లారెడ్డి కబ్జా బాగోతంపై సీబీఐతో(CBI) విచారణ చేయించాలని చేయించాలని డిమాండ్ చేశారు అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని, కిషన్‌రెడ్డిని(Kishan Reddy) కలిసి ఫిర్యాదు చేస్తానని కూడా చెప్పారు. రెండేళ్లలో ప్రభుత్వం వస్తుందని.. మల్లారెడ్డి భూబాగోతమంతా బయటపెడతానని పీసీసీ చీఫ్ పదవి చేపట్టిన సమయంలో రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.
అయితే ఈ ఆరోపణలను మల్లారెడ్డి తీవ్రంగా ఖండించారు. తాను ఒక్క ఎకరం భూమి ఎక్కడా కబ్జాచేయలేదని అసలు రేవంతే పెద్ద బ్లాక్ మెయిలరని.. (Blackmailer)లోఫర్, బట్టేబాజ్ అని ఘాటైన పదాలతో ఒంటికాలిపై లేచారు. ఆర్‌టీఐని(RTI) అడ్డుపెట్టుకొని వ్యాపారస్తులను బ్లాక్‌మెయిల్ చేసి వందల కోట్లు సంపాదించాడని ఆరోపించారు. రెండేళ్లు కాదు.. దమ్ముంటే మేడ్చల్‌లో(Medchal) పోటీ చేయాలని.. రేవంత్ ఓడిపోతే ముక్కు నేలకు రాయాలని తొడగొట్టి మరీ సవాల్ విసిరారు. 'మా సీఎంను, కేటీఆర్‌నే(KTR) విమర్శిస్తావరా' అంటూ రేవంత్‌పై తిట్ల దండకం ఎత్తుకున్నాడు. రేవంత్ ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. లేదంటే ఎంపీ పదవికి రేవంత్ రాజీనామా చేయాలని సవాల్ చేశారు. తాను కష్టపడి పైసలు సంపాదించానని.. తనకు 800 ఎకరాలున్నాయని.. కబ్జా చేయాల్సిన అవసరం నాకు లేదని.. అసలు ల్యాండ్ గ్రాబర్(Land grabber) రేవంతేనని విమర్శించారు.
తెలంగాణ(Telangana) ఎన్నికలు జరిగిపోయాయి. రేవంత్ చెప్పినట్లు రెండేళ్లు గడిచిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్ ప్రమాణం స్వీకారం చేశారు. వెనువెంటనే మల్లారెడ్డిపై పీఎస్‌లో ఫిర్యాదులు వచ్చాయి. మూడుచింతలపల్లి (Muduchintalapally)మండలంలోని దేవరయంజాల్ భూములు కబ్జాచేశారని ఆయనపై పోలీస్‌స్టేషన్లలో కొందరు ఫిర్యాదులు చేశారు. దీంతో మల్లారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు కేసులు నమోదయ్యాయి.
ఈ కేసులపై మల్లారెడ్డి స్పందిస్తూ.. తాను ఎవరి భూమి కబ్జాచేయలేదని దీనిపై నేను కూడా కోర్టును(Court) ఆశ్రయిస్తానని మల్లారెడ్డి చెప్తున్నారు. అక్కడి లంబాడీ సోదరులు భూములు అమ్ముకోగా ఎవరెవరో కొనుక్కున్నారని.. వారి మధ్య వివాదాలు నడుస్తున్నాయని..వాటిని వారే పరిష్కరించుకోవాలని మల్లారెడ్డి చెప్తున్నారు. అయితే ఇప్పుడు మల్లారెడ్డిపై కేసులు(case) నమోదు కావడంతో రెండేళ్ల క్రితం రేవంత్ అనుకున్నదే చేశారని.. మల్లారెడ్డిపై ఇప్పుడు కక్ష తీర్చుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారట. గతంలో మల్లారెడ్డి తన పట్ల చేసిన విమర్శలు రేవంత్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయని.. అందుకే ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి టార్గెట్(target) మాల్లారెడ్డే అయ్యారని అనుకుంటున్నారు.
మల్లారెడ్డి మాత్రం.. రేవంత్ తనకు మంచి మిత్రుడని..(Friend) ఈ కేసులు ప్రభుత్వ కక్ష సాధింపు కేసులు కావని మల్లారెడ్డి అంటున్నారు. కానీ కేసులకు, అరెస్టులకు(Arrest) భయపడి మల్లారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని.. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగాడని.. ఇప్పుడు రేవంత్ దెబ్బ ఎలా ఉందో మల్లారెడ్డి చూడబోతున్నాడని.. రేవంత్ మద్దతుదారులు సోషల్ మీడియాలో(Social media) కామెంట్స్ చేస్తున్నారు.