మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో మైనంపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే వార్తలు జోరందుకున్నాయి.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(Mynampally Hanumanth Rao) బీఆర్ఎస్ పార్టీ(BRS Party)కి రాజీనామా చేశారు. దీంతో మైనంపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే వార్తలు జోరందుకున్నాయి. మైనంపల్లి హనుమంతరావు ఢిల్లీ(Delhi)లో కాంగ్రెస్(Congress)లోని అగ్రనేతలను కలిశారని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మైనంపల్లి టీడీపీలో పనిచేశారు.
అయితే..మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరే విషయమై పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన కాంగ్రెస్‌ను నాలుగు టిక్కెట్లు కోరినట్లు తెలుస్తుంది. తనకు మల్కాజిగిరి, తన కుమారుడు రోహిత్ మైనంపల్లి(Rohith Mynampally)కి మెదక్(Medak), తన సన్నిహితుల కోసం మేడ్చల్(Medchal), సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు టికెట్లను ఆయన కోరుతున్నట్లు సమాచారం.
మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రోహిత్ మైనంపల్లికి టికెట్ నిరాకరించడంతో మైనంపల్లి.. మంత్రి హరీశ్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం మెదక్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి(Padmadevendar Reddy)కి మళ్లీ అవకాశం దక్కింది.
మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని మైనంపల్లి హనుమంతరావు ఓ వీడియోలో హరీశ్‌రావు(Harish Rao)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘తప్పకుండా గుణపాఠం చెబుతాను.. సూట్‌కేస్ తీసుకుని రబ్బర్ చెప్పులతో వచ్చాడు.. ఇప్పుడు ఎక్కడున్నాడో చూడండి.. ప్రస్తుతం నాకు సమయం లేదు.. ఈ ఎన్నికలలో మల్కాజిగిరిపై దృష్టి సారిస్తాను.. నా కొడుకు మెదక్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడు. దానిపై కూడా దృష్టి సారించాలి. ఆ తర్వాత సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్‌రావుకు అడ్రస్ లేకుండా చేస్తాను’’ అని హనుమంతరావు చెబుతున్న వీడియో వైరల్ అయ్యింది.