తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections) ముంచుకొస్తున్నాయి. పార్టీలన్నీ అభ్యర్థుల వేటలో పడ్డాయి. గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. అధికారపార్టీలోని అసంతృప్తులకు గాలం వేయడానికి ఇటు కాంగ్రెస్‌(Congress), అటు బీజేపీ(BJP) వ్యూహరచన చేస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌(BRS) నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరికీ(MLA) తిరిగి టికెట్‌ వస్తుందన్న గ్యారంటీ లేదు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections) ముంచుకొస్తున్నాయి. పార్టీలన్నీ అభ్యర్థుల వేటలో పడ్డాయి. గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. అధికారపార్టీలోని అసంతృప్తులకు గాలం వేయడానికి ఇటు కాంగ్రెస్‌(Congress), అటు బీజేపీ(BJP) వ్యూహరచన చేస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌(BRS) నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరికీ(MLA) తిరిగి టికెట్‌ వస్తుందన్న గ్యారంటీ లేదు. సిట్టింగ్‌లందరికీ టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అయితే చెప్పారు కానీ, ఎవరి టెన్షన్‌ వారికి ఉంది. కొన్ని నియోజకవర్గాలలో ఆశావహులు చాపకింద నీరులా పనులు చేసుకుంటూ వెళుతున్నారు. పటాన్‌చెరు(Patancheruvu) నియోజకవర్గంలో అన్ని తానై వ్యవహరిస్తున్నారు చిట్కుల్‌ సర్పంచ్‌ నీలం మధు ముదిరాజ్‌(Madhu Mudiraj).. పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు.

ప్రజలలో మమేకమయ్యే ఏ సందర్భాన్ని ఆయన వదలడం లేదు. సొంత ఖర్చుతో ప్రజోపయోగకర కార్యక్రమాలను చేపడుతున్నారు. తమ నేతకు కేటీఆర్‌(KTR) అండదండలు ఉన్నాయని మధు వర్గీయులు ప్రచారం చేస్తున్నారు కానీ ఇందులో నిజమెంతో ఎవరికీ తెలియదు. ఇక టికెట్‌ కోసమే కాబోలు ఈ మధ్యన అధికారపార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని పత్రికలలో అడ్వర్‌టైస్‌మెంట్ల రూపంలో ప్రచారం చేస్తున్నారు. ప్రముఖ దిన పత్రికలలో మొదటి పేజీలో యాడ్‌ అంటే మామూలు విషయం కాదు.. అది కూడా ఫుల్‌ పేజీ యాడ్‌కు బాగానే ఖర్చు అవుతుంది. పక్కాగా లెక్కలేసుకునే మధు ఈ పనులు చేస్తున్నారన్నది పటాన్‌చెరులో వినిపిస్తున్న మాట! అయితే మధు దూకుడుకు ఎప్పటికప్పుడు చెక్‌ పెడుతున్నారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి(Mahipal Reddy).. మధు ఎంత హంగామా చేసినా టికెట్‌ తనకే దక్కుతుందన్న గట్టి నమ్మకంతో ఆయన ఉన్నారు. నిరుడు చిట్కుల్‌లో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ విషయం తేటతెల్లమయ్యింది.

ఈ కార్యక్రమం విజయవంతమయ్యింది. అప్పట్నుంచే మధు వర్గంలో జోష్‌ పెరిగింది. పార్టీ కార్యకర్తలను, వివిధ సామాజికవర్గాలను సభకు రప్పించడంలో నీలం మధు సక్సెసయ్యారు. అయితే తన వర్గంవారు ఎవరూ ఆ కార్యక్రమానికి వెళ్లకుండా మహిపాల్‌రెడ్డి జాగ్రత్త పడ్డారు. నిజానికి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులు రావాల్సి ఉంది. మరి ఏం జరిగిందో ఏమో కానీ వీరిద్దరు హాజరు కాలేదు. నీలం మధును రాజకీయంగా దెబ్బ కొట్టేందుకే కేటీఆర్‌, హరీశ్‌లు రాకుండా మహిపాల్‌రెడ్డి చక్రం తిప్పారట!
ఇవాళ పటాన్చెరులో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిపాల్‌రెడ్డి నాయకత్వంలో పటాన్‌చెరు ఎంతో బాగుందని, ఎంతో అభివృద్ధి చెందిదని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

గతంలో పటాన్‌చెరులో పరిశ్రమలు కరెంట్‌ కోసం సమ్మె చేశాయని, ఇప్పుడు మూడు షిఫ్టులు పని చేస్తున్నాయని కేసీఆర్ అన్నారు. పటాన్‌చెరు నుంచి హయత్‌నగర్ వరకు మెట్రో రావాలన్నది ఇక్కడి ప్రజల కోరిక అని, మళ్లీ గెలిపిస్తే మెట్రో గ్యారంటీ అని సీఎ చెప్పారు. ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత నీలం మధు వర్గం కాస్త మెత్తపడింది. మరోవైపు మహిపాల్‌రెడ్డి వర్గంలో జోష్‌ నింపింది. మొత్తంగా కేసీఆర్‌ పటాన్‌చెరు పర్యటనతో మహిపాల్‌రెడ్డికి టికెట్‌ గ్యారంటీ అని తేటతెల్లమయ్యింది. ఈసారి ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలనుకుంటున్న నీలం మధు మనోవాంఛ ఫలిస్తుందా? కేటీఆర్ కనుకరిస్తారా? ఈసారికి ఇంతేనని సర్ది చెప్పుకుంటారా? చూడాలి మరి!

Updated On 22 Jun 2023 4:59 AM GMT
Ehatv

Ehatv

Next Story