ప్రేమిస్తున్నానంటూ మూడేళ్లుగా ఓ యువతిని వేధిస్తున్నాడో యువకుడు. ఆమె పెద్దగా రియాక్టవ్వకపోవడంతో కసి పెంచుకున్నాడు. డైరెక్ట్‌గా ఆ యువతి ఇంటికే వెళ్లి కత్తితో ఆమె కుటుంబసభ్యులపై దాడికి దిగాడు. యువతి కుటుంబసభ్యులు ఆత్మరక్షణ కోసం ప్రతిదాడికి దిగారు. ఈ దాడిలో ఆ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కాసేపటికి చనిపోయాడు. ఈ సంఘటన జగిత్యాల(Jagityala) జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లిలో జరిగింది.

ప్రేమిస్తున్నానంటూ మూడేళ్లుగా ఓ యువతిని వేధిస్తున్నాడో యువకుడు. ఆమె పెద్దగా రియాక్టవ్వకపోవడంతో కసి పెంచుకున్నాడు. డైరెక్ట్‌గా ఆ యువతి ఇంటికే వెళ్లి కత్తితో ఆమె కుటుంబసభ్యులపై దాడికి దిగాడు. యువతి కుటుంబసభ్యులు ఆత్మరక్షణ కోసం ప్రతిదాడికి దిగారు. ఈ దాడిలో ఆ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కాసేపటికి చనిపోయాడు. ఈ సంఘటన జగిత్యాల(Jagityala) జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లిలో జరిగింది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన బోగ మహేశ్‌(Boga Mahesh) తన దూరపు బంధువైన తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో తెగ వేధిస్తున్నాడు. అతగాడి వేధింపులు భరించలేక మార్చి 2వ తేదీన మల్యాల పోలీసులకు కంప్లయింట్‌ చేసింది. ఈ విషయం తెలుసుకున్న మహేశ్‌ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా చంపేయాలని(Murder) డిసైడయ్యాడు. సోమవారం మధ్యాహ్నం ఓ కత్తి తీసుకుని ఆ యువతి ఇంటికి వెళ్లాడు. అతడికి మొదట ఆ యువతి తల్లి కనిపించింది. ఆమెపై కత్తితో దాడికి దిగాడు. తప్పించుకునే క్రమంలో కత్తి ఆమె కాలికి తగిలింది. ఆ తర్వాత అక్కడే మంచంపై పడుకున్న యువతి తాతను కత్తితో పొడిచాడు. వెంటనే అప్రమత్తమైన యువతి తల్లి అక్కడే ఉన్న తన తమ్ముడు నర్సయ్యతో(Narsiah) కలిసి మహేశ్‌ను నిలువరించే ప్రయత్నం చేసింది. ఈ గొడవలో మహేశ్‌ కిందపడ్డాడు. అక్కడే ఉన్న బండరాయితో మహేశ్‌పై దాడి చేసింది యువతి తల్లి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహేశ్‌ అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన నర్సయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌కు తరలించారు. మహేశ్‌కు ఆ యువతి దూరపు బంధువు అవుతుంది. ఈ వంకతో పరిచయం పెంచుకున్న మహేశ్‌ ఆమె ఫోన్‌ నంబర్‌ తీసుకున్నాడు. ప్రేమిస్తున్నానంటూ రోజూ వేధిస్తున్నాడు. రెండేళ్ల కిందటే ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కొంతకాలం యువతికి దూరంగా ఉన్నాడు మహేశ్‌. కొన్ని రోజుల నుంచి మళ్లీ వేధింపులు మొదలు పెట్టాడు. ఈ క్రమంలో చాలా సార్లు పంచాయితీ పెట్టారు. పెద్దలు మహేశ్‌ను హెచ్చరించారు. అయినా అతడు కొంచెం కూడా మారలేదు. మార్చి 6వ తేదీ ఆ యువతి బర్త్‌డే. ఆ రోజును తాను డెత్‌ డేగా మారుస్తానంటూ మహేశ్‌ సోషల్‌ మీడియాలో పోస్టులు కూడా పెట్టాడు. దీంతో ఈ నెల 2వ తేదీన పోలీసులకు ఈ విషయంపై కంప్లయింట్‌ ఇచ్చారు యువతి తల్లిదండ్రులు. మహేశ్‌ను కావాలనే కొట్టి చంపారంటూ అతడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లయింట్‌ మేరకు యువతితో పాటు ఆమె తల్లి, అన్న, వదిన, అమ్మమ్మ, తాతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి ఇంటి దగ్గర పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశా రు.

Updated On 5 March 2024 12:11 AM GMT
Ehatv

Ehatv

Next Story