మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి(Mahendhar Reddy) టీఎస్‌పీఎస్సీ చైర్మన్(TSPSC Chairman)గా బాధ్యతలు చేపట్టారు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన ఈ పదవిలో 11 నెలల పాటు కొనసాగుతారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‍గా మహేందర్ రెడ్డితో పాటు ఐదుగురు సభ్యులను కూడా నియమించారు. రిటైర్డ్ ఐఏఎస్ అనితా రాజేంద్ర, రిటైర్డ్ పోస్టల్ డిపార్టుమెంట్ ఆఫీసర్ అమిరుల్లా ఖాన్, జేఎన్టీయూ ప్రొఫెసర్ నర్రి యాదయ్య, జేన్కో ఈడీ రామ్మోహన్ రావు, రిజైన్డ్ గ్రూప్ 2 ఆఫీసర్ పాల్వాయి రజనీకుమారిలను సభ్యులుగా నియమించారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు.
కమిషన్ సభ్యులుగా నియమితులైన వారు 62 ఏండ్లు వచ్చేవరకు మాత్రమే పదవిలో కొనసాగేందుకు అవకాశం ఉంది. ఆరేళ్ల పాటు మాత్రమే ఆ పదవిలో కొనసాగాల్సి ఉంటుంది. 1962లో డిసెంబర్3న జన్మించిన మహేందర్‌రెడ్డికి ప్రస్తుతం ఆయనకు 61 సంవత్సరాలు. ఇంకో 11 నెలలు ఆయనకు 62 సంవత్సరాలకు చేరుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన 11 నెలల పాటు పదవిలో కొనసాగనున్నారు.
అంతకు ముందు టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా జనార్దన్ రెడ్డి ఉన్నారు. పలు కారణాలతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పలువురు సభ్యులూ రాజీనామా చేశారు. సభ్యుల నియామకాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం అర్హత గల వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వీటిని పరిశీలించాక మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది.