మీరు మ్యాట్రిమోనీలో(Matrimony) పేర్లు నమోదు చేసుకున్నారా. మ్యాట్రిమోనీ ద్వారా పెళ్లి(Marriage) చేసుకోవాలనుకుంటే ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్తలు పాటించాల్సిందే. మ్యాట్రిమోనీలో పెళ్లిళ్ల కోసం పేర్లు నమోదు చేసుకున్న మహిళలే టార్గెట్‌గా కొందరు కీచకులు మోసాలకు పాల్పడుతున్నారు. పెళ్లి పేరుతో రప్పించి డబ్బు, నగదుతో ఉడాయిస్తున్నారు.
మీరు మ్యాట్రిమోనీలో(Matrimony) పేర్లు నమోదు చేసుకున్నారా. మ్యాట్రిమోనీ ద్వారా పెళ్లి(Marriage) చేసుకోవాలనుకుంటే ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్తలు పాటించాల్సిందే. మ్యాట్రిమోనీలో పెళ్లిళ్ల కోసం పేర్లు నమోదు చేసుకున్న మహిళలే టార్గెట్‌గా కొందరు కీచకులు మోసాలకు పాల్పడుతున్నారు. పెళ్లి పేరుతో రప్పించి డబ్బు, నగదుతో ఉడాయిస్తున్నారు. తాజాగా ఈఘటన హైదరాబాద్‌లో(Hyderabad) మహంకాళి పీఎస్(Mahankali PS) పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
రంగారెడ్డి(Ranga Reddy) జిల్లా కందుకూరు(Kandukur) మండలం నేదునూర్‌కు చెందిన తుమ్మ మోహన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యాట్రిమోనీలో పేర్లు రిజిస్టర్ చేసుకున్న మహిళలను లక్ష్యంగా చేసుకొని బంగారంతో ఉడాయించిన తుమ్మ మోహన్‌రెడ్డిని(Thumu Mohan Reddy) పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా ఇతగాడి నేరాల చిట్ట ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చింది. ఈ కేటుగాడికి 2011లో కల్వకుర్తికి చెందిన మహిళతో పెళ్లి జరిగింది. అయితే గత కొంత కాలంగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. భారత్ మ్యాట్రిమోనీలో(Bharath Matrimony) శ్రీనాథ్ అనే పేరుతో రిజిస్టర్ చేసుకున్నాడు.. విడాకులు తీసుకొని, రెండో పెళ్లికి రిజిస్టర్ చేసుకున్న ఓ మహిళకు ఫోన్ చేశాడు. తనను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, వీలైతే ఒకసారి కలుద్దామని ఫోన్‌లో నమ్మబలికాడు. దీంతో ఆ మహిళ ఈ కీచకుడి మాటలు నమ్మింది. అంతేకాదు వచ్చేటప్పుడు నగలతో వస్తే ఫొటో తీసుకొని పేరెంట్స్‌కు చూపించి, ఒప్పించి పెళ్లిచేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. దీంతో ఈనెల 7న మహంకాళి పీఎస్ పరిధిలోని యాత్రి ఇన్ హోటల్‌కు వచ్చారు. వాష్‌రూమ్‌కు వెళ్లి ఫ్రెష్ కావాలని మహిళకు చెప్పాడు. మహిళ వాష్‌రూమ్‌కు వెళ్లిన వెంటనే బంగారు నగలు ఉన్న బ్యాగ్ తీసుకొని హోటల్ నుంచి జంప్ అయ్యాడు. దీంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్ట్ చేసి 27 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నేరాల చిట్టాను పోలీసులు విప్పారు.
ఇతగాడి నేర చిట్టా ఎలా ఉందంటే.. గతంలోనూ షాదీ డాట్ కామ్(Shadhi.com) మ్యాట్రీమోనీ సైట్‌లో నిందితుడు మోహన్‌రెడ్డి తన పేరును గౌతంరెడ్డి పేరుతో నమోదు చేసుకొని మరో మహిళను నమ్మించాడు. ఆమె క్రెడిట్ కార్డు ద్వారా రూ.6.20 లక్షలతో బంగారు నగలు కొనుగోలు చేసి పరారయ్యాడు. మరో మ్యాట్రిమోనీలో విజయ్‌రెడ్డి అనే పేరుతో మరో మహిళను నమ్మించి తన అకౌంట్‌లో 9 లక్షల రూపాయలు వేసుకున్నాడు. కల్వకుర్తిలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూ పదో తరగతి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి 3 నెలలపాటు జైలుకెళ్లాడు. కందుకూరు పీఎస్‌లో తన బంధువుకు కారు ఇప్పిస్తానని మోసం రూ.4.50 లక్షలకు కాజేశాడు. మాదాపూర్‌లోని ఓ హాస్టల్‌లో 70 వేల విలువైన ల్యాప్‌టాప్, వస్తువులు దొంగతనం చేశాడని మోహన్‌రెడ్డిపై కేసు ఉంది. చైతన్యపురిలోనూ 40 వేల విలువైన ల్యాప్‌టాప్ దొంగిలించాడు. పలు కేసుల్లో దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు.
మ్యాట్రిమోనీలో ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా వహించాలని, పూర్తి వివరాలు తెలియకుండా ఎలాంటి నగదు, నగలు అప్పగించకూడదని పోలీసులు సూచిస్తున్నారు.