కూడబెట్టుకున్న పైసలను ఎక్కడ దాచిపెట్టుకోవాలో పాపం ఆ వృద్ధురాలికి తెలియదు. ఇంట్లో డబ్బులు పెట్టుకుంటే దొంగలెత్తుకెళతారన్న భయంతో గొయ్యి తీసి పాతి పెట్టింది. ఈ ఘటన మహబూబాబాద్‌(Mahabubabad) జిల్లా బయ్యారం మండలం జగ్గు తండాలో జరిగింది. తండాకు చెందిన తమ్మిశెట్టి రంగమ్మకు చిన్న కిరాణ దుకాణం ఉంది.

కూడబెట్టుకున్న పైసలను ఎక్కడ దాచిపెట్టుకోవాలో పాపం ఆ వృద్ధురాలికి తెలియదు. ఇంట్లో డబ్బులు పెట్టుకుంటే దొంగలెత్తుకెళతారన్న భయంతో గొయ్యి తీసి పాతి పెట్టింది. ఈ ఘటన మహబూబాబాద్‌(Mahabubabad) జిల్లా బయ్యారం మండలం జగ్గు తండాలో జరిగింది. తండాకు చెందిన తమ్మిశెట్టి రంగమ్మకు చిన్న కిరాణ దుకాణం ఉంది. ఆ షాపు ద్వారా ఆమె కొద్దో గొప్పో సంపాదిస్తూ వస్తున్నది. వచ్చిన డబ్బును పొదుపు చేసింది. ఓ రెండు లక్షల రూపాయల వరకు పోగేసింది. ఊరికేళ్లాల్సిన పనిపడటంతో ఇంట్లో డబ్బులు పెట్టుకుంటే దొంగలు ఎత్తుకెళతారన్న భయంతో ఓ ప్లాస్టిక్ డబ్బులో ఉంచి ఇంటి ఆవరణలో గొయ్యి తీసి పాతిపెట్టింది. ఆ తర్వాతే ఊరికెళ్లింది. ఊరి నుంచి వచ్చి చూస్తే డబ్బులు కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ వృద్ధురాలి ఇంటికి వచ్చి ఇంటి ఆవరణలో వెతికారు. భూమిలో పాతి పెట్టిన రెండు లక్షల రూపాయలు దొరికాయి. ఇలా డబ్బులను పాతిపెట్టడం సరికాదని, బ్యాంకులో దాచుకోవాలని వృద్ధురాలికి సూచించారు పోలీసులు.

Updated On 23 Jan 2024 1:45 AM GMT
Ehatv

Ehatv

Next Story